VIj, Jan 18: ఏపీలోని నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం పరిశీలించారు. స్వచ్ఛ కార్మికులకు సత్కారం చేయడమే కాదు చెత్త రవాణా వాహనం ప్రారంభించి, స్వయంగా నడిపారు పవన్.
ప్రతి ఇంటి నుంచీ చెత్త రహిత సమాజం ఆలోచన పుట్టాలన్నారు పవన్. స్థానిక సంస్థలు సైతం చెత్త వినియోగం మీద ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ పక్కాగా నిర్వహించాలని సూచించారు.
అనంతరం గ్రామ స్థాయిలో సేకరించిన చెత్త వివిధ నిర్వహణా క్రమాన్ని పరిశీలించారు. మొదట పళ్లు, కూరగాయల వ్యర్ధాల నిర్వహణను పరిశీలించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల రీ సైక్లింగ్, శానిటరీ వేస్ట్ మేనేజ్ మెంట్ పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వ్యర్ధాలతో వర్మి కంపోస్ట్ తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న మూడు రకాల బుట్టలను అధికారులు పవన్ కళ్యాణ్ కి చూపారు. ఎన్టీఆర్ అంటే ప్రభంజనం..సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నెంబర్ 1, నివాళులు అర్పించిన నారా లోకేష్, బాలకృష్ణ,భువనేశ్వరి
తడి చెత్త, పొడి చెత్తతో పాటు విష పూరిత వ్యర్ధాలను వేరు చేసేందుకు ఇంటికి మూడు చెత్త బుట్టలు ఇస్తున్నట్టు తెలిపారు. చెత్త నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల యంత్ర పరికరాల పనితీరుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్న గ్రామాల వివరాలు, సంపద సృష్టి కేంద్రాల సహకారంతో పండించిన పళ్లు, కూరగాయల ప్రదర్శనను తిలకించారు.
AP Dy CM Pawan Kalyan participated Swachh Andhra Swachh Diwas program in Nambur
నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
•చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం పరిశీలన
•స్వచ్ఛ కార్మికులకు సత్కారం
•చెత్త రవాణా వాహనం ప్రారంభించి, స్వయంగా నడిపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు pic.twitter.com/kb2VlmVKI7
— JanaSena Party (@JanaSenaParty) January 18, 2025
ఇటీవల విజయవాడ వరదల్లో అహర్నిశలు పని చేసి పారిశుద్ధ్య మెరుగుదలకు కృషి చేసిన 35 మంది స్వచ్ఛ కార్మికులను ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సత్కరించారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలుకరిస్తూ, శాలువా కప్పి నూతన వస్త్రాలు, పళ్లు బహూకరించారు.
గ్రామ స్థాయిలో చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన వాహనాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించి స్వయంగా నడిపారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి విడతగా గ్రామ స్థాయిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించారు.