Vizag Car Accident: విశాఖలో కారు బీభత్సం.. డివైడర్ ను దాటి బైక్ ను ఢీకొట్టి.. ఆపై చెట్టు పొదల్లోకి వెళ్లిన వాహనం.. ప్రమాద ఘటనలో ముగ్గురి మృతి
వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా బైక్ పై వస్తున్న వారిని అనంతరం ఢీకొట్టింది. ఆపై చెట్టు పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పైన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతి చెందాడు.
Vizag, Aug 8: విశాఖలో (Vizag) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన కారు (Car) అదుపు తప్పి డివైడర్ ను (Divider) దాటి ఎదురుగా బైక్ (Bike) పై వస్తున్న వారిని అనంతరం ఢీకొట్టింది. ఆపై చెట్టు పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పైన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ విషాద ఘటన సోమవారం రాత్రి 10గంటల సమయంలో విశాఖపట్టణంలోని బీచ్ రోడ్డులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో భార్యభర్తలు సింగారపు పృథ్వీరాజ్ (28), ప్రియాంక(21)గా పోలీసులు గుర్తించారు. కారులో మరణించిన వ్యక్తిని మణికుమార్(25)గా గుర్తించారు. ఈ విషాదం ఘటన సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నట్లు తెలిసింది. వారిలో ముగ్గురు ఘటన స్థలం నుంచి పరారవ్వగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాల కోసం వీడియో చూడండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)