Jagtial, Aug 8: జగిత్యాల జిల్లా (Jagtial District) బీర్ పూర్ ఎంపీడీఓ కార్యాలయం (MPDO Office) శిథిలావస్థకు చేరుకొండి. చూరు ఎప్పుడు కూలుతుందా అని భయపడుతూ ఉద్యోగులు (Employees) బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయం పెచ్చులూడిపోతుండంతో నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో హెల్మెట్లు (Helmets) ధరించి విధులకు హాజరవుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం బయటే టేబుళ్లు వేసుకుని పని చేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. 2016లో బీర్ పూర్ మండలం ఏర్పడిన నాటి నుంచీ ఎంపీడీఓ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏడాది నుంచి పెచ్చులూడటం ప్రారంభించింది.
Please respond on this issue sir asap.
బీర్పూర్: శిధిలావస్థలో ఉన్న బీర్పూర్ MPDO కార్యాలయంలో భయంతో హెల్మెట్లు ధరించి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది https://t.co/UwWyfEPxLR
— kiran kumar (@AKIRNKUMR) August 7, 2023
దేవుడికి మొక్కులు
దీంతో గతేడాది ఎంపీడీఓ మల్లారెడ్డి కూర్చుని ఉండగా ఆయన టేబుల్‌పై పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అప్పటి అదనపు కలెక్టర్ కార్యాలయాన్ని మార్చాలని ఆదేశించారు. కానీ, అమలుకు నోచుకోలేదు. దీంతో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్న కార్యాలయ ఉద్యోగులు ఇలా హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు.. కార్యాలయం మరో చోటుకు మారాలంటూ సమీపంలోని హనుమాన్ ఆలయంలో కూడా వారు మొక్కుకున్నారు.