Newdelhi, Aug 8: మలయాళ ప్రముఖ దర్శకుడు (Malayalam Director), స్క్రీన్ రైటర్ సిద్ధిక్ (Siddique) గుండెపోటుతో (Heart Attack) కొచ్చిలోని ఆసుపత్రిలో చేరారు. 69 ఏళ్ల ఈ దర్శకుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది. అతనికి కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం, సిద్ధిక్ న్యుమోనియా, కాలేయ వ్యాధి కారణంగా వైద్య సంరక్షణలో ఉన్నారు. ఈ అనారోగ్యాలతో చికిత్స కొనసాగుతుండగానే గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం సిద్దిక్‌కు ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఈసీఎంఓ) మెషిన్ సపోర్ట్ అందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Malayalam director Siddique suffers heart attack, in critical condition: Reporthttps://t.co/C3GgaJ6FwS
— India Today Showbiz (@Showbiz_IT) August 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)