ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు(Raghavendra Rao), కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రాఘవేంద్రరావుకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ప్రతీ సంవత్సరం దర్శించుకుంటానని చెప్పారు రాఘవేంద్రరావు. వాస్తవానికి శ్రీవారిని దర్శించుకోవడం రాఘవేంద్రరావుకు సెంటిమెంట్. ఆయన దర్శకత్వం వహించిన సినిమా రిలీజ్‌కు ఉందంటే ఖచ్చితంగా శ్రీవారిని దర్శించుకుంటారు.

అందరిలో దయా గుణం తగ్గిపోతుంది.. ఎక్స్ వేదికగా హీరోయిన్ రష్మికా మందన్న ఆసక్తికర ట్వీట్, వైరల్‌గా మారిన పోస్ట్

తిరుమలలో ఫిబ్రవరి 12న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరుగనుంది. పురాణాలపరంగా తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. అయితే ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మకరమాసం నందు నిర్వహించడం ఆనవాయితీ.

Director K. Raghavendra Rao   Visits Tirumala Srivari Temple

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)