బీజేపీ నేతలు చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్, లగచర్ల రైతులను పరామర్శించడానికి వెళ్తున్న బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మొయినాబాద్ వద్ద అడ్డుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ అరెస్ట్, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెట్టిన పోస్టుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు, అరెస్టుపై మండిపడిన హరీష్ రావు

ఈ సందర్భంగా డీకేఅరుణ మాట్లాడుతూ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా..? ఒక ఎంపీ గా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా..? కొడంగల్ రేవంత్ రెడ్డి జాగిరా..?ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా రైతులను కొడుతున్నారు. నా నియోజకవర్గంలోకి వెళ్లనీయకుండా నన్ను అడ్డుకుంటారా’అని డీకేఅరుణ ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్‌ జులుం నశించాలంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు.

Police arrested BJP MPs Etela Rajender and DK Aruna 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)