Siddipet Train: నేటి నుంచి సిద్దిపేట-కాచిగూడ మధ్య రైల్వేసేవలు.. ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటలో రైలు కూత వినిపించనున్నది. మంగళవారం మధ్నాహ్నం 3 గంటలకు సిద్దిపేట రైల్వేస్టేషన్ లో మంత్రి హరీశ్‌రావు రైలును ప్రారంభించనున్నారు.
Siddipet, Oct 3: సిద్దిపేటలో (Siddipet) రైలు కూత వినిపించనున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైలు (Train) నేడు సిద్దిపేటకు రానున్నది. సీఎం కేసీఆర్ (CM KCR) దశాబ్దాల కల సాకారం కానున్నది. మంగళవారం మధ్నాహ్నం 3 గంటలకు సిద్దిపేట రైల్వేస్టేషన్ లో మంత్రి హరీశ్‌రావు రైలును ప్రారంభించనున్నారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న రైల్వేలైన్ పనులు స్వరాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే గజ్వేల్ వరకు పనులు పూర్తయి రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల సిద్దిపేట వరకు రైల్వేలైన్ నిర్మాణం పూర్తయింది. దాంతో మంగళవారం నుంచి సిద్దిపేట-కాచిగూడకు రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. కాగా, మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేస్టేషన్ల మధ్య నూతన రైలు మార్గాన్ని మంగళవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా జాతికి అంకితం చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు.