CM KCR Press Meet: ఉద్యమంలో అమరులైన రైతులకు రూ. 3 లక్షలు సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్, కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం అందించాలని డిమాండ్

ఉద్యమ సమయంలో రైతులపై వేల సంఖ్యలో కేసులు నమోదు చేశారని, రైతులకు మద్దతు తెలిపిన అమాయకులపైనా కేసులు పెట్టారని ఆరోపించారు.

Telangana CM K Chandrasekhar Rao | File Photo

ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంపై పోరాటం షురూ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతుల విషయంలో కేంద్రం వైఖరి దుర్మార్గమని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల కోసం ఉద్యమించిన రైతుల్లో 750 మంది వరకు రైతులు మరణించారని, వారి కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని అన్నారు.

ఉద్యమంలో మరణించిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున సాయం అందిస్తామని, కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారంగా అందించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో రైతులపై వేల సంఖ్యలో కేసులు నమోదు చేశారని, రైతులకు మద్దతు తెలిపిన అమాయకులపైనా కేసులు పెట్టారని ఆరోపించారు. ఆ కేసులన్నింటిని ఎత్తివేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై స్పందిస్తూ, బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలన్నారు. బాయిల్డ్ రైస్ ను కేంద్రం కొనబోవడంలేదంటూ ప్రచారం జరుగుతోందని, అందులో నిజమెంతో వెల్లడి కావాల్సి ఉందని పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

Pawan Kalyan On Telangana State: తెలంగాణ అంటే నా గుండె కొట్టుకుంటుంది...పోరాటల గడ్డ, బండెనక బండి కట్టి నాకు ఇష్టమైన పాట, పరిపాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అని మండిపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Manipur CM's House Under Attack: మ‌ణిపూర్ సీఎం నివాసంపై దాడి, మ‌రోసారి ర‌ణ‌రంగంగా మారిన ఇంఫాల్, సీఎం బిరెన్ సింగ్ సుర‌క్షితం

Elon Musk Lawsuit Against Open AI: మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐపై ఎలాన్ మ‌స్క్ న్యాయ‌పోరాటం, గుత్తాధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌ని అభియోగం

KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్‌ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?