Telangana: నిజామాబాద్‌లో ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ అధికారి, అధికారుల కళ్ళు చెదిరిపోయేలా నోట్ల కట్టలు బయటకు, మొత్తం రూ. 6.70 కోట్లు స్వాధీనం

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారి దాసరి నరేందర్‌ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు.

Telangana Nizamabad Corporation Superintendent Dasari Narender caught by ACB officials in Municipal Office

నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారి దాసరి నరేందర్‌ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో గుట్టలుగా ఉన్న నోట్ల కట్టల్ని గుర్తించారు. మొత్తం రూ. 6.70 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.  వచ్చే వారం కవితకు బెయిల్, కేటీఆర్ సంచలన కామెంట్స్,సుంకిశాల పాపం కాంగ్రెస్‌దేనని ఆరోపణ

ఏసీబీ సోదాల్లో రూ.2కోట్ల 93లక్షల 81వేల నగదు, నరేందర్ బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి 10 లక్షల నగదు, అరకిలో బంగారు ఆభరణాలు, 1కోటి 98 లక్షల విలువ చేసే ఆస్తుల్ని సీజ్‌ చేశారు. మొత్తం 6కోట్ల 7లక్షల విలువగల ఆస్తుల గుర్తించారు. ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మున్సిపల్ అధికారి నరేందర్ బంధువుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. నరేందర్‌ను అరెస్ట్‌ చేసిన అధికారులు హైదారాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తరలించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now