River Ganges: భూకంపంతో తన ప్రవాహ దిశను మార్చుకున్న గంగానది.. పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
ఆసియాలో పెద్ద నదుల్లో ఒకటైన గంగానదికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2500 ఏండ్ల క్రితం సంభవించిన ఒక భూకంపం వల్ల గంగానది ప్రవాహ దిశను మార్చుకున్నదని ఈ అధ్యయనంలో తేలింది.
Newdelhi, June 22: ఆసియాలో (Asia) పెద్ద నదుల్లో ఒకటైన గంగానదికి (River Ganges) సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2500 ఏండ్ల క్రితం సంభవించిన ఒక భూకంపం వల్ల గంగానది ప్రవాహ దిశను మార్చుకున్నదని ఈ అధ్యయనంలో తేలింది. సాధారణంగా నదులు క్రమంగా దిశ మార్చుకునేందుకు వందల ఏండ్లు పడుతుంది. గంగానది లాంటి పెద్ద నది దిశ మార్చుకోవడం దాదాపు జరగదని పరిశోధకులు ఇప్పటివరకూ భావించారు. అయితే, ఒక భారీ భూకంపం కారణంగా గంగానది ఒకేసారి దిశ మార్చుకుందని వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 7 – 8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఈ మార్పు చోటు చేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)