Sebastian Pinera Passes away: హెలికాఫ్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా దుర్మరణం.. శోకసంద్రంలో కూరుకుపోయిన చిలీ.. సంతాపం ప్రకటించిన పలు దేశాలు

హెలికాఫ్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా దుర్మరణం

Sebastian Pinera (Credits: X)

Newdelhi, Feb 7: చిలీ (Chile) దేశ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) (Sebastian Pinera) హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. మంగళవారం లాగో రాంకో టౌన్‌లో హెలికాఫ్టర్ కూలడంతో ఆయన మరణించారు. హెలికాఫ్టర్‌ లోని మిగతా ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. మాజీ అధ్యక్షుడి మృతితో యావత్ దేశం శోక సంద్రంలో కూరుకుపోయింది. వివిధ దేశాధినేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు. పినేరా రెండు సార్లు చిలీ దేశాధ్యక్ష పదవిని అధిష్టించారు. 2010-14, 2018-2022 మధ్య కాలంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు.

Foldable House: ‘ఆ కుర్చీ మడతపెడితే..’ అని పాడటం కాదు.. ‘ఆ ఇల్లు మడత పెడితే..’ అంటూ ఇక పాడాల్సిందే! అవును మరి. మడతపెట్టే ఇల్లు వచ్చేసిందోచ్.. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు!! మీరూ ట్రై చెయ్యండి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement