IPL 2023: చెన్నైకి భారీ షాక్, మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీ, అందుకే చివరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించలేకపోయాడని తెలిపిన సీఎస్‌కే హెడ్‌ కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్

చెపాక్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది

MS Dhoni (Photo credit: Twitter)

ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండో పరాజయం చవిచూసింది. చెపాక్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ.. సీఎస్‌కే విజయానికి చివరి బంతికి 5 పరుగులు అవసరమవ్వగా.. మిస్టర్‌ కూల్‌ బంతిని బౌండరీకి తరలించడంలో విఫలమయ్యాడు. దీంతో రాజస్థాన్ విజయకేతనం ఎగరవేసింది. ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోనీ.. ఒక్క ఫోర్‌, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో ఉత్కంఠ భరితమైన మ్యాచులో చేతులెత్తేసిన చెన్నై సూపర్ కింగ్స్, విజయానికి 3 పరుగుల దూరంలో నిలిచి పోయిన ధోనీ సేన

ఇదిలా ఉంటే సీఎస్‌కే హెడ్‌ కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వాఖ్యలు.. ఆ జట్టు అభిమానులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడని ఫ్లెమింగ్‌ తెలిపాడు. ధోని ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఫీల్డ్‌లో కూడా పరుగు తీసేందుకు కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అందుకే అతడు రెండు పరుగుల రావల్సిన సందర్భాల్లో కేవలం సింగిల్‌ మాత్రమే తీయగలిగాడు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌కు సర్వం సిద్ధం, ఆ రెండు స్టేడియాల్లోనే పాక్ ఆడుతుందట, భారత్ ఆసియా కప్ ఆడకుంటే ప్రపంచకప్ మేము ఆడమని తేల్చేసిన దాయాది దేశం

ప్రస్తుతం అతడు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. మా తర్వాతి మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కాబట్టి.. ధోని కోలుకోంటాడని ఆశిస్తున్నామని తెలిపారు. ఇక సీఎస్‌కే తమ తదుపురి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 17న ఆర్సీబీతో తలపడనుంది.