Team India New Head Coach: శ్రీలంక సీరీస్ తోనే టీమిండియా కొత్త కోచ్ నియామకం.. బీసీసీఐ చీఫ్ జై షా వెల్లడి

రాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టు భావిస్తున్నారు.

Jay Shah-Rohit (Credits: X)

Newdelhi, July 1: టీమిండియా కొత్త కోచ్ (Team India New Head Coach) నియామకం రానున్న శ్రీలంక (Srilanka) సీరీస్ లో జరుగనున్నట్టు బీసీసీఐ చీఫ్ జై షా తెలిపారు. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టు భావిస్తున్నారు. పూర్తివివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా కొత్త కోచ్ కోసం గత మేలో దరఖాస్తును విడుదల చేసింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్‌ ని ఎంపిక చేస్తారు.

ఎన్నికల ముందు జగన్ సర్కారు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు, జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

కోచ్ పదవి 3.5 సంవత్సరాలు

ఎంపికైన ప్రధాన కోచ్ పదవి 1 జులై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఇందుకోసం జై షా నాలుగు షరతులు పెట్టారు.

మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం, ఏపీ మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే..