Alai Balai: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు దత్తన్న ‘అలయ్ బలయ్’.. హాజరుకానున్న ప్రముఖులు
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది.
Hyderabad, Oct 13: హైదరాబాద్ (Hyderabad) లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో (Nampally Exhibition Grounds) నేడు అలయ్ బలయ్ (Alai Balai ) కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంలకు ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ (Telangana), హర్యానా (Haryana) గవర్నర్లు (Governors), వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు. సినీ ప్రముఖులను కూడా అలయ్ బలయ్ కమిటీ అహ్వానించింది. ఆలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ (Vijayalakshmi) ఆహ్వానించారు. అటు ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది.
ఏమిటీ అలయ్ బలయ్ ?
తెలంగాణ ఉద్యమం కోసం అందరినీ ఓ చోట సంఘటితం చేసేందుకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 'అలయ్ బలయ్' కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిభింబించేలా.. సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకగా బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya), ఆయన కుటుంబసభ్యులు ప్రతి ఏటా దసరా పండుగ మరుసటి రోజు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు, అధికారులను ఆహ్వానించి, అందరినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చి అలయ్ బలయ్ జరుపుకుంటారు. కాగా అలయ్ బలయ్ కార్యక్రమం 19వ వసంతంలోకి అడుగుపెట్టింది.