Vijayawada, Oct 13: ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారంనాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాగానికి సూచించింది.
ఈ జిల్లాల్లో ఎక్కువగా ప్రభావం
ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం అంచనా వేసింది.