Chandrababu-Revanth (Credits: X)

Hyderabad, Oct 4: బండారు దత్తాత్రేయ (Dattatreya's Alai Balai) అనగానే తెలుగు ప్రజలందరికీ గుర్తొచ్చేది ‘అలయ్ బలయ్’ ఈవెంట్. ఏటా దసరా మరుసటి రోజున రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హర్యానా గవర్నర్‌ గా ఉన్నప్పటికీ ఈ సంప్రదాయాన్ని ఇంకా  కొనసాగిస్తున్నారు. ఈ నెల 13న జరిగే ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని (Revanth Reddy) దత్తాత్రేయ ఆహ్వానించారు. అటు, ఏపీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) కూడా ఆహ్వానం అందింది.

మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం.. మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన (వీడియో)

ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీక

తెలంగాణ సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీక ఈ కార్యక్రమమని దత్తాత్రేయ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ లో జరగనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.

నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు... రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు