రాష్ట్రీయం
Tomorrow Weather: రేపటి వాతావరణం.. జూలై 24 తెలుగు రాష్ట్రాల వాతావరణ నివేదిక.. ఏపీ, తెలంగాణల్లో కొనసాగనున్న వర్షాలు..
Team LatestlyTomorrow Weather: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా పుంజుకున్న నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, అనుబంధ ద్రోణి ప్రభావంతో రేపు (శుక్రవారం, జూలై 24) కూడా వాతావరణం తేమగా, ఆకాశం మేఘావృతమై ఉండనుంది.
Telangana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. చంచలగూడ జైలుకు ముత్యం వెంకట రమణ.. కూడబెట్టిన ఆస్తులు రూ. 150 కోట్ల పైమాటే..
Team LatestlyTelangana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణకు నగర న్యాయస్థానం గురువారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
IMD Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. ఐఎండీ లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో..
Team LatestlyIMD Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పుంజుకున్న నైరుతి రుతుపవనాల ప్రవాహం.. దీనికి తోడు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, అనుబంధ ద్రోణి ప్రభావంతో వాతావరణం గణనీయంగా మారిపోయింది. గత కొంతకాలంగా వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో ప్రస్తుతం మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి.
LinkedIn Jobs Report: ఉపాధి అవకాశాల్లో దూసుకుపోతున్న విశాఖపట్నం.. లింక్డ్‌ఇన్ జాబితాలో అగ్రస్థానం.. టాప్ టెన్ నాన్-మెట్రో నగరాలు ఇవే..
Team Latestlyఉద్యోగం, ఉపాధి అనగానే నిరుద్యోగులకు ముందుగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ వంటి టైర్-1 మెట్రో నగరాలే గుర్తుకువస్తాయి. అయితే ఇటీవలి కాలంలో నాన్-మెట్రో నగరాలు కూడా వేగంగా ఎదుగుతూ, ప్రతిభకు తగ్గ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ వేదిక 'లింక్డ్‌ఇన్' తాజాగా వెల్లడించింది.
Weather Update Tomorrow: రేపటి వాతావరణం సూచన.. తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. హైదరాబాద్, విజయవాడ ఇతర నగరాల వాతావరణం అప్ డేట్ ఇదే..
Team Latestlyతెలంగాణ వాతావరణ శాఖ (IMD హైదరాబాద్) అందించిన తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండగా, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Thalliki Vandanam: నేడు తల్లికి వందనం నిధులు విడుదల.. 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు తల్లికి వందనం లబ్ధి..
Team Latestlyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల చదువులను ప్రోత్సహించడం, వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే ధ్యేయంగా చేపట్టిన ‘తల్లికి వందనం’ పథకం రెండో ఏడాది నిధుల విడుదలకు సర్వం సిద్ధం చేసింది. పేద కుటుంబాలలోని విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో అమరావతి వేదికగా నేడు ఈ నగదు విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Weather Update: ఐఎండీ హెచ్చరిక.. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..ఈ రోజు వాతావరణం ఎలా ఉందంటే..
Team Latestlyదక్షిణాది రాష్ట్రాలను వరుణుడు కరుణించడంతో మంగళవారం సాయంత్రం నుండి తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
AP Weather Update: ఏపీ వెదర్ అప్‌డేట్, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
Weather Update Today: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఆదేశాలు, ఈ రోజు వాతావరణం ఇదిగో...
Team Latestlyతెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం రాత్రి నుండి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
Tomorrow Weather Update: రేపటి వాతావరణం అప్‌డేట్.. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతపవనాలు, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Team Latestlyనైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతుండటంతో పాటుగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూలై నెల మధ్య భాగం నాటికి వేసవి తాపం పూర్తిగా తగ్గి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం చల్లబడింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని లెక్చరర్‌ని చితకబాదిన తల్లిదండ్రులు, ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో ఘటన
Team Latestlyప్రకాశం జిల్లాలోని నాగలుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న బక్కమంతుల వినయ్ అనే లెక్చరర్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లివిరిశాయి. విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడన్న సమాచారం తెలిసిన తల్లిదండ్రులు, గ్రామస్థులు కళాశాలకు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్చరర్‌ని పట్టుకుని చితకబాదారు.
Hyderabadi Biryani: ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని దక్కించుకున్న హైదరాబాద్ బిర్యానీ, టాప్ 10 రైస్ డిషెస్‌లో చోటు, అగ్రస్థానంలో జపనీస్ వంటకాలు
Team Latestlyప్రపంచవ్యాప్తంగా మరోసారి హైదరాబాదీ బిర్యానీ తన ప్రత్యేక రుచితో అందరినీ ఆకట్టుకుంది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఆన్‌లైన్ ఫుడ్ & ట్రావెల్ ప్లాట్‌ఫార్మ్ టేస్ట్ అట్లాస్ తాజాగా విడుదల చేసిన వరల్డ్ బెస్ట్ రైస్ డిషెస్ 2025 జాబితాలో మన హైదరాబాదీ బిర్యానీ టాప్ 10లో చోటు దక్కించుకోవడం గర్వకారణం.
Visakhapatnam: కూతురి పెళ్లి ఆగిపోయిందన్న మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య, వరుడి కుటుంబ సభ్యులను వేడుకున్నా ఫలితం శూన్యం, వాట్సాప్‌లో బంధువులకు సూసైడ్ నోట్ పంపిన మృతుడు
Team Latestlyకూతురు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయిందన్న ఆవేదనను తట్టుకోలేక ఓ తండ్రి ప్రాణాలు తీసుకున్న విషాదకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివాహం రద్దయిందన్న షాక్ నుంచి బయటపడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది.
Hyderabad: ట్రాఫిక్ డ్యూటీలో రౌడీషీటర్లు, రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగం, తొలి దశలో 60 మందికి బాధ్యతలు, మంచి పౌరులుగా మార్చడమే లక్ష్యమన్న కమిషనర్
Team Latestlyసమాజంలో మార్పు తీసుకురావాలంటే కఠిన శిక్షలు మాత్రమే సరిపోవు, మార్పు అవకాశాలు కూడా ఇవ్వాలి. నేర చరిత్ర ఉన్నవారికి కొత్త జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో రాచకొండ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
Hyderabad: ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ, హైదరాబాద్‌లో విషాదకర ఘటన, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Team Latestlyహైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యక్తిగత సమస్యలతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోసపోయాననే మనస్తాపంతో ఈ దుస్థితి ఎదురైందని పోలీసులు వెల్లడించారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి (26) ఈ ఘటనలో మరణించాడు.
Andhra Pradesh: ఏపీలో మరో 3 జిల్లాలు ఏర్పాటు, కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు, రాష్ట్రంలో 29కి చేరనున్న మొత్తం జిల్లాల సంఖ్య,మంత్రుల కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆయన ఆమోదం తెలిపారు.
Tirumala Token Booking: డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు, నవంబర్ 27 నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్ల రిజిస్ట్రేషన్, సామాన్య భక్తులకు ప్రాధాన్యం.. తొలి మూడు రోజులు సర్వదర్శనానికే
Team Latestlyడిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు మొత్తం 10 రోజులు భక్తులకు వైకుంఠ ద్వారాల ద్వారా స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ భక్తుల సౌకర్యం దృష్ట్యా పలు కీలక మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు.
'No Religious Rituals on Duty': డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు, తెలంగాణ పోలీసు శాఖ కీలక ఆదేశాలు, ముందస్తుగా సెలవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచన
Team Latestlyతెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బంది మతపరమైన దీక్షల్లో పాల్గొనే విషయంలో కొత్తగా కఠిన ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప దీక్ష వంటి ఆచారాల్లో ఉన్న అధికారులు, సిబ్బంది డ్యూటీకి హాజరుకావద్దని, తప్పనిసరిగా ముందస్తు సెలవు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, నేడు వాయుగుండంగా మారే అవకాశం, ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Team Latestlyదక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడన స్థాయిలో ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది
Andhra Pradesh: వీడియో ఇదిగో, డ్యూటీ సమయంలో ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగి, కంప్యూటర్లు పని చేయడం లేదంటూ సేవలు నిలిపివేత
Team Latestlyకాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలంలోని ఒక పోస్టాఫీసులో duty సమయంలో ఉద్యోగి ప్రవర్తనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ సేవలు పొందడానికి వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని, కంప్యూటర్లు పనిచేయడం లేదనే పేరుతో సేవలను నిలిపివేసి ఉద్యోగి మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ గడుపుతున్నాడని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.