Black Fungus in Andhra pradesh: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్, ఇప్పటి వరకు 1,623 కేసులు, 103 మంది మృతి, ఆంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్ల కోసం కంపెనీలకు ఆర్డర్‌ ఇచ్చామని తెలిపిన సింఘాల్

రాష్ట్రంలో మొత్తం 1623 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, బ్లాక్ ఫంగస్ (Black Fungus in Andhra pradesh) చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లు, టాబ్లెట్లని కేంద్రమే సరఫరా చేస్తోందన్నారు.

Mucormycosis (Photo Credits: Wiki)

Vijayawada, June 8: ఏపీలో బ్లాక్ ఫంగస్ వల్ల 103 మరణాలు (103 people have died) నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 1623 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, బ్లాక్ ఫంగస్ (Black Fungus in Andhra pradesh) చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లు, టాబ్లెట్లని కేంద్రమే సరఫరా చేస్తోందన్నారు. ఏపీలో 20 ఏళ్ల లోపున్న వారు 11.07 శాతం మంది ఉన్నారని తెలిపారు. మూడో దశలో 20 ఏళ్ల లోపున్న వారికి రెండింతల కేసులు నమోదైనా చికిత్స అందించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.

కొవిడ్‌తో పోలిస్తే బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో మరణాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి. కరోనా సోకినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొంది.. ఇళ్లకు వెళ్లి, రెండు, మూడు వారాల అనంతరం బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 397 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయి. చిత్తూరు- 212, కృష్ణా -201, అనంతపురం - 178, కర్నూలు-160, విశాఖ జిల్లాలో 155 చొప్పున కేసులు నమోదయ్యాయి. తక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి.

కరోనాకి తోడయిన బ్లాక్‌ ఫంగస్‌, నిర్లక్ష్యంగా ఉంటే కంటి చూపుతో పాటు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం, మ్యూకోర్‌మైకోసిస్‌ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు ఇవే

ప్రకాశం జిల్లాలో 83 కేసులు నమోదైతే 15 (14.45%) మంది ప్రాణాలు విడిచారు. కర్నూలు జిల్లాలో 14, గుంటూరు-14, విశాఖపట్నం-14, చిత్తూరు జిల్లాలో 13 మంది మృత్యువాతపడ్డారు. అనంతపురం జిల్లాలో 11 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే ఐదుగురు మరణించారు.

ఏపీలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్‌ చికిత్స

కేంద్రం ద్వారానే ఆంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్లు (Liposomal Amphotericin-B injections) వస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రానికి 13,105 ఇంజెక్షన్లు వచ్చాయి. 1,225 అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాటిని బాధితులకు ఇచ్చారు. 91,650 ఆంఫోటెరిసిన్‌ ఇంజెక్షన్ల కోసం కంపెనీలకు ఆర్డర్‌ ఇచ్చాం. కేంద్రం కేటాయించిన కోటా ప్రకారమే ఇవి రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్రం ఇప్పటివరకు 12,250 పోసోకొనజోల్‌ ఇంజెక్షన్లు 1,01,980 మాత్రలు కొనుగోలు చేసిందని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ తెలిపారు.