MHA says COVID-19 situation 'especially serious' in Mumbai, Pune, Kolkata, Jaipur, Indore (Photo-PTI)

Amaravati, May 17: ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ (AP Curfew Extension) ఉండాలని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని ఆయన పేర్కొన్నారు. రూరల్‌ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కరోనా కట్టడి చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

రఘురామ బెయిల్ పిటిషన్‌.. శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం తరపు న్యాయవాది దవే

ఇక బ్లాక్ ఫంగస్‌ చికిత్సను (Black Fungus) సైతం ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్టు ప్రకటించారు. ఆ ఇవాళ ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోతే.. వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

సమావేశానంతరం మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోతే.. వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ తెలిపారన్నారు. అర్హుల పేర కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసి.. దానిపై వచ్చే వడ్డీని ప్రతినెలా వారికి ఇచ్చేలా ఆలోచనలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని ఆళ్ల నాని తెలిపారు.

ఏపీ సర్కారు కీలక నిర్ణయం, కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు సాయం, ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లుకు ఆదేశాలు

నెలాఖరు వరకు కర్ఫ్యూ (Curfew Extension Until The End Of The This Month) సంధర్భంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. పాజిటివ్ పేషంట్ల గుర్తింపు కోసం ఫీవర్ సర్వే చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత పకడ్బంధీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వేలో గుర్తించిన వారిలో అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తామని మంత్రి ఆళ్లనాని చెప్పారు.

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలేతే వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఆళ్లనాని తెలిపారు. పదివేల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఈనెలాఖరు కల్లా 2వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ రాబోతున్నాయని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్లనాని తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసులను వెంటనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణకు వాడే మందులను సమకూర్చాలని సీఎం ఆదేశించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.

ఏపీలో కొత్తగా బ్లాక్‌ ఫంగస్‌ కేసు నమోదు, 21,101 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, తాజాగా 101 మంది కరోనాకు బలి, అత్యధికంగా అనంతపురం జిల్లాలో 3,356 పాజిటివ్ కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు.