MP Raghu Rama Case: రఘురామ బెయిల్ పిటిషన్‌.. శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం తరపు న్యాయవాది దవే
Supreme Court of India | (Photo Credits: IANS)

Amaravati, May 17: సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ బి. ఆర్. గవాయితో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. మధ్యాహ్నం ఒంటి గంటకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది. బెయిల్ పిటిషన్‌పై (MP Raghu Rama Krishnam Raju bail petition ) సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

రఘురామ తరఫున ముకుల్ రోహిత్గి, ఆదినారాయణ వాదనలు ( petition arguments in Supreme court) వినిపించగా, ఎపి సిఐడి తరఫున దుశ్యంత్ దవే, వివి గిరి వాదనలు వినిపించారు. కస్టడీలో ఎంపి రఘురామను (MP Raghu Rama Krishnam Raju Case) పోలీసులు కొట్టారని ముకుల్ రోహిత్గి తెలిపారు. బెయిల్‌తో పాటు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు అనుమతివ్వాలన్నారు. ఇప్పటి వరకు ప్రైవేటు ఆస్పత్రిలో రఘురామను పరీక్షించలేదన్నారు. ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఎంపీని అరెస్ట్ చేసిన తీరు సరిగా లేదని..ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదని కోర్టుకు తెలిపారు.

కేవలం బెయిల్ రాకూడదనే సెక్షన్ 124 (ఏ) కింద కేసు నమోదు చేశారన్నారు. రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. అదనపు డీజీ స్వయంగా విచారణకు ఆదేశించారని దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని రోహిత్గీ కోర్టుకు తెలిపారు. రఘురామను పోలీసులు కొట్టారని తీవ్రంగా హింసించారని అరికాళ్లకు తగిలిన గాయాలను న్యాయమూర్తికి ఎంపీ చూపించారని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ లో రఘురామకు బైపాస్ సర్జరీ జరిగిన విషయాన్ని న్యాయమూర్తికి లాయర్ తెలిపారు.

రఘురామకృష్ణరాజును రమేష్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించిన హైకోర్టు, గుంటూరు జైలుకు నరసాపురం ఎంపీ, జైల్లోని పాత బిల్డింగ్ మొదటి సెల్‌లో 3468 నంబర్ కేటయింపు

అనంతరం ఏపీ ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని సుప్రీంకోర్టుకు సీఐడీ లాయర్‌ దుష్యంత్‌ దవే తెలిపారు. సీనియర్‌ జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలకు సిద్ధమని పేర్కొన్నారు. సమీపంలో ఆర్మీ ఆస్పత్రులున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, 300 కి.మీ. దూరంలో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి ఉందని, విశాఖలో నేవీ ఆస్పత్రి కూడా 300 కి.మీ దూరంలో ఉందని లాయర్‌ రావు తెలిపారు. విశాఖలో తుఫాను పరిస్థితులున్నాయని.. కేంద్రం ఆధీనంలోని మంగళగిరి ఎయిమ్స్‌ అన్నింటికంటే దగ్గరగా ఉందని లాయర్‌ దవే వివరించారు. రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అభ్యంతరం లేదన్నారు.

రమేష్ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు జరపాలన్న రోహిత్గీ వాదనలపై దవే అభ్యంతరం తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యులతో పరీక్షలు చేయిస్తే అభ్యంతరం లేదన్నారు. ఈ సంధర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్ స్పందిస్తూ దగ్గరలో ఆర్మీ ఆస్పత్రి ఉందా అని ప్రశ్నించారు. దీనిపై రఘురామ తరపు న్యాయవాది స్పందిస్తూ..సికింద్రాబాద్ లో ఉందని చెప్పగా సమీపంలో ఏపీలో లేదా తెలంగాణలో ఆర్మీ ఆస్పత్రి ఉందా అని ప్రశ్నించారు.

ట్విస్టులతో సాగుతున్న ఎంపీ కథ, ఆ గాయాలు అంతా అబద్దమని తెలిపిన అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, రఘురామకృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్ విధించిన సీఐడీ కోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన నరసాపురం ఎంపీ

సికింద్రాబాద్ లో ఉందని అక్కడి నుంచే నిందితున్ని అరెస్ట్ చేసి తీసుకువచ్చారని న్యాయవాది తెలిపారు. ఆంధ్రాలో విశాఖలో నేవల్ బేస్ ఆస్పత్రి ఉందని అది కూడా 300 కిమి దూరం ఉందని వివరించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు విచారణను వాయిదా వేసింది. అనంతరం 12 గంటల తర్వాత విచారణ ప్రారంభమైన తర్వాత రఘురామ వైద్య పరీక్షలకు 10 కిమి దూరంలో విజయవాడ మణిపాల్ ఆస్పత్రి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

వైద్య పరీక్షలకు ఢిల్లీ ఎయిమ్స్ మంచిదని రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మంగళగిరి ఎయిమ్స్ తో కొన్ని భయాలు ఉన్నాయని అక్కడ పాలకమండలిలో ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఎయిమ్స్ కు తరలింపుపై తమకు అభ్యంతరం లేదని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా అన్నారు. ఈ సంధర్భంగా పరీక్షలు ఆర్మీ ఆస్పత్రిలో ఎందుకు నిర్వహించకూడదని ధర్మాసనం ప్రశ్నించింది.

ఆర్మీ ఆస్పత్రిని రాజకీయాల్లోకి లాగడం ఎందుకని తుషార్ మొహతా వ్యాఖ్యానించగా ఇందులో రాజకీయం లేదని ఒక న్యాయాధికారిని నియమిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే కేవలం వైద్య పరీక్షలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని అడ్మిషన్ కు అవకాశం ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది దవే కోరారు. పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని గురువారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను శుక్కవారానికి వాయిదా వేసింది. ఆస్పత్రిలో వైద్య పరీక్షలపై మధ్యాహ్నం ఒంటి గంటకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వనుంది.