MP Raghu Rama Krishna Raju (Photo:Twitter/RaghuRaju_MP)

Guntur, May 16: ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును (Raghu Rama Krishna Raju Case) గుంటూరు జిల్లా జైలుకు తరలించడం తెలిసిందే. రఘురామకృష్ణరాజుకు రిమాండ్ ఖైదీ నెంబరు 3468 కేటాయించారు. ఆయనను జైల్లోని పాత బిల్డింగ్ మొదటి సెల్ లో (Guntur district jail) ఉంచారు. తాజాగా ఎంపీ రఘురామకృష్ణరాజుకు స్వల్ప ఊరట కలిగింది. గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి (Ramesh Hospital) తరలించాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది.

ఈ సాయంత్రం హైకోర్టులో రఘురామ (Narasapuram MP Raghurama Krishna Raju) వైద్య పరీక్షల నివేదికపై విచారణ జరిగింది. వైద్య పరీక్షల నివేదికను పరిశీలించిన స్పెషల్ డివిజన్ బెంచ్... రఘురామ తరఫు న్యాయవాదుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. కాగా, రమేశ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాన్ని పట్టించుకోలేదని రఘురామ తరఫు న్యాయవాదులు డివిజన్ బెంచ్ కు విన్నవించారు. కస్టడీలో ఉండగానే సీఐడీ అధికారి పిటిషనర్ (రఘురామ)ను కలిశారని, కస్టడీలో ఉండగా కలవడం చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రఘురామ తరపు న్యాయవాది వాదనలను రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ట్విస్టులతో సాగుతున్న ఎంపీ కథ, ఆ గాయాలు అంతా అబద్దమని తెలిపిన అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, రఘురామకృష్ణంరాజుకు 14 రోజుల రిమాండ్ విధించిన సీఐడీ కోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన నరసాపురం ఎంపీ

సీఐడీ కోర్టు, ఏపీ హైకోర్టు ఉత్తర్వుల్లోని కొన్ని అంశాలను మాత్రమే ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను సీఐడీ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. మెడికల్ రిపోర్టును పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని రఘురామ తరపున న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఎంపీ రఘురామను గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో చుక్కెదురు, బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు, CRPC 124 (A) సెక్షన్‌, 120 (B) IPC సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన సీఐడీ

అటు, ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, రఘురామకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని ప్రస్తావించారు. కొద్దిసేపటి క్రితమే వాదనలు పూర్తి కాగా, ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ కోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాలను అమలు పర్చాలని ఆదేశించింది.ఇక ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఆయనను అధికారులు గుంటూరు జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజుకు ఖైదీ నంబర్‌ 3468 కేటాయించారు. జైల్లోని పాత బ్యారక్‌లో ఒక సెల్‌ను అలాట్‌ చేశారు. రఘురామకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గుంటూరు జిల్లా కోర్టులో మెడికల్ రిపోర్ట్‌ను సమర్పించింది.

నేడు ఎంపీని మరోసారి విచారణ చేయనున్న సీఐడీ, నిన్న అర్ధరాత్రి వరకు విచారణ, ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు, నేడు విచారణకు రానున్న పిటిషన్

కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ 12/2021 నమోదు చేశారు. ఎంపీ రఘురామ కేసులో మెడికల్ బోర్డును సీఐడీ కోర్టు ఏర్పాటు చేసింది. మెడికల్ బోర్డు హెడ్‌గా గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి నియమితులయ్యారు. సభ్యులుగా మరో ముగ్గురు వైద్యులను నియమించారు. హెడ్ ఆఫ్ ది జనరల్ మెడిన్ డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ సుబ్బారావులు వీరిలో ఉన్నారు.