కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు సాయం అందించనున్నట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. కోవిడ్ కారణంగా మరణించే వారి అంత్యక్రియల ఖర్చుల కోసం చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెం 236ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ విడుదల చేశారు. అంతిమ సంస్కారాలకు అవసరం అయిన నిధులను విడుదల చేయాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది.
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 94,550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 24,171 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,35,491 మందికి కరోనా వైరస్ సోకింది. మొత్తం మరణాల సంఖ్య 9,372కు చేరింది. గడిచిన 24 గంటల్లో 21,101 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 12 లక్షల 15 వేల 683 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య శాఖ తెలిపింది.
Here's Update
అమరావతి: కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు సాయం అందించనున్నట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. కోవిడ్ కారణంగా మరణించే వారి అంత్యక్రియల ఖర్చుల కోసం చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసింది.
— Sakshi TV (@SakshiHDTV) May 16, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)