Amaravati, May 16: ఏపీలో గత 24 గంటల్లో 94,550 కరోనా పరీక్షలు నిర్వహించగా... 24,171 మందికి పాజిటివ్ (AP Coronavirus Report) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 3,356 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2,885 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 2,876 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2,426 కేసులు, విశాఖ జిల్లాలో 2,041 కేసులు గుర్తించారు.
అదే సమయంలో రాష్ట్రంలో 21,101 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 14,35,491 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 12,15,683 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,10,436 మంది చికిత్స పొందుతున్నారు.
Here's AP Covid Update
#COVIDUpdates: As on 16th May 2021 10:00 AM
COVID Positives: 14,32,596
Discharged: 12,12,788
Deceased: 9,372
Active Cases: 2,10,436#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/tV6PKpc5XA
— ArogyaAndhra (@ArogyaAndhra) May 16, 2021
ఏపీలో తాజాగా 101 మంది కరోనా కారణంగా మరణించినట్టు (Covid Deaths) తాజా బులెటిన్ లో వెల్లడైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 14 మంది కన్నుమూయగా, విశాఖ జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది మృత్యువాతపడ్డారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో ఇప్పటివవరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 9,372కి పెరిగింది.
రాష్ట్రంలో కొవిడ్ మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు.
ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. సమాచారం ప్రకారం..15 రోజుల క్రితం బాధితుడు కరోనా నుంచి కోలుకున్నాడు. కాగా ఏలూరు ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన సమయానికే బాధితుడు కన్నువాపుగా ఉండేది. అయితే గత వారం రోజులుగా కన్నువాపు పెరుగుతుండడంతో రాజమండ్రి, విశాఖ ఆస్పత్రుల్లో పరీక్షలు చేసుకోగా ఫంగస్ లక్షణాలుగా నిర్థారణ అయ్యింది. ఈ వాపు కన్నుతో పాటు, ముక్కు, మెదడుకు వ్యాపిస్తుందని వైద్యులు చెప్తున్నారు.