Shocking Incident in Kakinada: హమ్మో! కుక్క కరిచిన ఆరు నెలలకు రేబీస్.. బాలుడి దుర్మరణం.. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వెలుగు చూసిన ఘటన.. కుక్క కరిచినా భయపడి ఇంట్లో చెప్పని బాలుడు.. అందుకే, ఇలా!!
ఆరు నెలలు గడిచింది. అయితే, అనూహ్యంగా అతడికి రేబీస్ సోకింది. దీంతో ఆదివారం మృతి చెందాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది.
Kakinada, July 24: కుక్క (Dog) కరిచిన విషయం ఇంట్లో చెబితే తిరిగి తననే తిడతారని ఓ బాలుడు (Boy) భయపడ్డాడు. ఆరు నెలలు గడిచింది. అయితే, అనూహ్యంగా అతడికి రేబీస్ (Rabies) సోకింది. దీంతో ఆదివారం మృతి చెందాడు. కాకినాడ (Kakinada) జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే.. తేలు ఓంసాయి అనే 17 ఏళ్ల బాలుడిని ఆరు నెలల క్రితం వీధి కుక్క కరిచింది. ఈ విషయం అతడు ఇంట్లో చెప్పలేదు. మూడు రోజుల క్రితం అతడికి తీవ్ర జ్వరం వచ్చింది. మంచినీళ్లు తాగలేకపోయిన బాలుడు నీళ్లను చూస్తే భయపడటం ప్రారంభించాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని శనివారం కాకినాడు జీజీహెచ్‌లో చేర్చారు.
అలా చేసి ఉంటే బతికేవాడు
వ్యాధి ముదరడంతో వైద్యం ఫలించక బాలుడు ఆదివారం మృతిచెందాడు. కుక్క కాటుకు గురైన రోజునే యాంటీ రేబీస్ వ్యాక్సిన్‌తో పాటూ టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ తరువాత 3వ రోజు, 7వ రోజు, 28వ రోజు టీకా తీసుకుంటే రేబీస్ వ్యాధి ముప్పు తప్పిపోతుందని చెప్పారు. బాలుడ కుక్క కరిచిన విషయం ఇంట్లో చెప్పకపోవడం.. టీకా సకాలంలో తీసుకోకపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని తెలిపారు.