Newdelhi, July 24: పోలీసువ్యవస్థకే (Police Department) తలవంపులు తీసుకొచ్చే ఘటన ఇది. మార్నింగ్ వాక్ (Morning Walk) చేస్తున్న ఓ డీఐజీ (DIG) వద్ద నుంచి దొంగలు ఫోన్ చోరీ (Phone Theft) చేసిన ఘటన అస్సాంలోని (Assam) గువాహటిలో వెలుగు చూసింది. ఈ ఘటన పోలీసు శాఖకు తలవంపులని కొందరు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. చోరీ ఘటనపై స్పందించిన గువాహటి పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ప్రీతిబీ రాజ్‌ఖోవా.. పల్టన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోరీ జరిగిందని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Thieves strike high-profile target! Law and Order DIG Vivek Raj Singh's cell phone snatched during morning walk. #DIG #VivekRajSinghhttps://t.co/1Qq2LUWfSo
— India Today NE (@IndiaTodayNE) July 23, 2023
అసలేం జరిగిందంటే??
లా అండ్ ఆర్డర్ విభాగం అధికారి వివేక్ రాజ్ సింగ్ ఆదివారం ఉదయం నగరంలోని రోడ్డుపై మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన దొంగలు ఆయన ఫోన్ ను లాక్కుని వెళ్లిపోయారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ కు కూతవేటు దూరంలో ఉన్న మాజర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఆ రోడ్డులో అనేక మంది ఐపీఎస్ అధికారుల నివాసాలు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.