Alcohol Prices Hiked In AP: మందు బాబులకు జగన్ సర్కారు ఝలక్, మద్యం ధరలు మరోసారి పెంపు, మద్యం నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

ఇందులో భాగంగా మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఊహించని షాకిచ్చింది. ఇప్పటికే 25 శాతం మద్యం పెంచిన ప్రభుత్వం... తాజాగా మద్యం ధరలను మరో 50 శాతం పెంచుతూ (Liquor Prices Hiked In AP) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పెంచిన ధరలు నేటి(మంగళవారం) నుంచే అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం (AP Govt) తెలిపింది.

Alcohol | Image used for representational purpose (Photo Credits: IANS)

Amaravati, May 5: రాష్ట్రంలో మద్యం నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఊహించని షాకిచ్చింది. ఇప్పటికే 25 శాతం మద్యం పెంచిన ప్రభుత్వం... తాజాగా మద్యం ధరలను మరో 50 శాతం పెంచుతూ (Liquor Prices Hiked In AP) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ‌కి క్యూ కట్టిన తమిళనాడు, తెలంగాణ మందుబాబులు, అధికారులకు తెలియడంతో అక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేత, దేశ వ్యాప్తంగా భారీగా క్యూ లైన్లు

పెంచిన ధరలు నేటి(మంగళవారం) నుంచే అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం (AP Govt) తెలిపింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నుంచి మంగళవారం నాడు ఉత్వర్వులు వెలువడ్డాయి. పెంచిన ధరలతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

అలాగే ఈ నెలాఖరులోగా మరో 15 శాతం మద్యం షాపులు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా కేంద్రం మార్గదర్శకాల మేరకు దాదాపు 45 రోజుల తర్వాత నిన్న మద్యం దుకాణాలకు అనుమతించడంతో.. నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మద్యాపానాన్ని నిరుత్సాహరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీకి ఎంఫాన్ రూపంలో తుపాను గండం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం ఆదేశాలు

ఇందుకు సంబంధించి ఎక్సైస్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ మాట్లాడుతూ.. కొత్తగా పెంచిన 50 శాతం ధరలను నేటి నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. ఈరోజు ఒక గంట ఆలస్యంగా మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు.   ఏపీలో మూడవ దశ లాక్‌డౌన్, గ్రీన్ జోన్లలో 25 శాతం పెంపుతో మద్యం అమ్మకాలు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల ప్రాతిపదికగా సడలింపులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

ఇదిలా ఉంటే ఈ నెలాఖరులోగా 15శాతం మద్యం దుకాణాలను మూసేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న షాపుల సంఖ్య 3,468. మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకే ఇలా ధరల పెంచుతున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో పలు రాష్ట్రాల్లో మద్యం ధరలు భారీగా పెరిగాయి.  మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్, మద్యం ధరలను 30 శాతం పెంచిన మమత సర్కారు, అదే బాటలో పలు రాష్ట్రాలు

పశ్చిమ బెంగాల్ లోని మమత సర్కారు 30 శాతం మద్యం ధరలను పెంచింది. కాగా ఎక్సైజ్ రిటైల్ లైసెన్స్ ల ద్వారా విక్రయించే అన్ని మద్యం బాటిళ్లపై ఏకంగా 70 శాతం ధరలు పెంచుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు 2020, మే 04వ తేదీ సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.  నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్‌ 3.0, దేశ వ్యాప్తంగా పలు ఆంక్షలు సడలింపు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో మరింత పటిష్టంగా చర్యలు

ఢిల్లీలో సోమవారం లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటించాలని, కనీసం ఆరు అడుగుల దూరం నిలబడాలని, కొన్ని నిబంధనలు విధించింది కేంద్రం. కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు పాటించలేదు. మద్యం అమ్మకాలతో అధిక ఆదాయం సంపాదించుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రేట్లను పెంచుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం కరోనా సెస్ విధించనుంది. కరోనా ఫీ పేరిట ఏకంగా 70 శాతం సుంకం విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంగళవారం నుంచి మద్యం ధరలు పెరగనున్నాయి.