Amara Raja Batteries: ఏపీలో అమర రాజా బ్యాటరీస్‌ పరిశ్రమల మూసివేత, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ఇప్పటికే జువారి సిమెంట్‌ పరిశ్రమ మూసివేతకు ఉత్తర్వులు

కాలుష్యాన్ని వెదజల్లుతున్నపరిశ్రమలపై ఏపీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ (ఏపీపీసీబీ) (Andhra Pradesh Pollution Control Board (APPCB) మండలి కొరడా ఝళిపిస్తోంది. వైఎస్సార్‌ జిల్లా యర్రగుంట్లపల్లి మండలంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న జువారి సిమెంట్‌ పరిశ్రమ మూసివేతకు గత నెల 24న ఉత్తర్వులు జారీ చేసిన కాలుష్య నియంత్రణ మండలి.. తాజాగా అమర రాజా బ్యాటరీస్‌కు (Amara Raja Batteries) చెందిన రెండు పరిశ్రమల మూసివేతకు ఆదేశాలిచ్చింది.

Amara Raja Batteries (Photo- amararaja.com website)

Amaravati. May 2: కాలుష్యాన్ని వెదజల్లుతున్నపరిశ్రమలపై ఏపీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ (ఏపీపీసీబీ) (Andhra Pradesh Pollution Control Board (APPCB) మండలి కొరడా ఝళిపిస్తోంది. వైఎస్సార్‌ జిల్లా యర్రగుంట్లపల్లి మండలంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న జువారి సిమెంట్‌ పరిశ్రమ మూసివేతకు గత నెల 24న ఉత్తర్వులు జారీ చేసిన కాలుష్య నియంత్రణ మండలి.. తాజాగా అమర రాజా బ్యాటరీస్‌కు (Amara Raja Batteries) చెందిన రెండు పరిశ్రమల మూసివేతకు ఆదేశాలిచ్చింది.

అమర రాజా బ్యాటరీస్‌ పరిశ్రమల్లో లోపాలను సరిదిద్దుకోవాలంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినా ఆ కంపెనీ యాజమాన్యం స్పందించలేదు. దాంతో ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న రెండు పరిశ్రమలనూ మూసివేయాలంటూ (Amara Raja Batteries receives closure orders) ఏపీ పీసీబీ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. తనిఖీల్లో వెల్లడైన లోపాలను సరిదిద్దుకుని కాలుష్య ఉద్గారాలకు యాజమాన్యాలు అడ్డుకట్ట వేయగలిగేలా చర్యలు తీసుకుంటే ఈ పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిస్తామని నోటీసుల్లో తెలిపింది.

కాగా అమర రాజా బ్యాటరీస్‌ పరిశ్రమల్లో ఫిబ్రవరి 25, 26, మార్చి 8, 9, 25, 26 తేదీల్లో ఏపీ పీసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతి జారీ చేసినప్పుడు పేర్కొన్న ప్రమాణాలతో పోలిస్తే వాయు కాలుష్యం అధికంగా ఉన్నట్టు తేలింది. క్యూబిక్‌ మీటర్‌ వాయువు(గాలి)కి నిబంధనల మేరకు లెడ్‌ (సీసం) 1 మైక్రో గ్రాము ఉండాలి. కానీ.. ట్యాబులర్‌ బ్యాటరీస్‌ ఉత్పత్తి చేసే విభాగంలో 1.151, ఆటోమొబైల్‌ బ్యాటరీస్‌ విభాగంలో 22.2 మైక్రో గ్రాములు ఉన్నట్టు తేలడంతో పర్యావరణ అనుమతిలో పేర్కొన్న నిబంధనలను అమర రాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ ఉల్లంఘించినట్టు ఏపీ పీసీబీ అధికారులు తేల్చారు.

మంత్రి ఈటలకు షాక్..ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్‌కు బదిలీ, ఉ‍త్తర్వులు జారీ చేసిన గవర్నర్, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని తెలిపిన ఈటల రాజేందర్, భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని వెల్లడి

పరిశ్రమ అవసరాల కోసం రోజూ వినియోగించే నీటి ద్వారా వచ్చే 2,186 కిలో లీటర్ల వ్యర్థ జలాలను సక్రమంగా శుద్ధి చేయకుండానే గ్రీన్‌ బెల్ట్‌లో పెంచుతున్న మొక్కలకు సరఫరా చేస్తున్నట్టు తేలింది. గ్రీన్‌ బెల్ట్‌లోని పలుచోట్ల మార్చి 9న మట్టి నమానాలను సేకరించిన ఏపీ పీసీబీ అధికారులు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒక కిలో మట్టిలో కనిష్టంగా 49.2 నుంచి గరిష్టంగా 177.5 మిల్లీగ్రాముల సీసం ఉండాలి. కానీ 295.5 మిల్లీ గ్రాముల సీసీం ఉన్నట్టు తేలింది.

పరిశ్రమలో పనిచేసే 3,533 మంది ఉద్యోగుల రక్త నమూనాలను సేకరించిన తనిఖీ బృందం వాటిని పరీక్షించింది. రక్త నమూనాల్లో సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్టు వెల్లడైంది. పరిశ్రమ పరిసర గ్రామాల్లోని ప్రజల నుంచి సేకరించిన రక్త నమూనాల్లోనూ సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్టు నిర్దారణ అయింది. దీంతో ఏప్రిల్‌ 6న అమర రాజా బ్యాటరీస్‌ సంస్థకు ఏపీ పీసీబీ అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా.. ఏప్రిల్‌ 20న అమర రాజా సంస్థ సమాధానం ఇచ్చింది.

లాక్‌డౌన్ మీద జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు, లాక్‌డౌన్ విధిస్తే ప్రభుత్వానికి రూ.1 నష్టం జరిగితే, ప్రజలకు రూ.4 నష్టం జరుగుతుంది, గతేడాది ప్రభుత్వానికి రూ.20,000 కోట్ల నష్టం, ప్రజలకు రూ.80,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపిన ఏపీ సీఎం

దీనిపై ఏప్రిల్‌ 22న ఎక్సటర్నల్‌ అడ్వైజరీ కమిటీ (ఈఏసీ) సమావేశమై సమగ్రంగా చర్చించింది. పర్యావరణ అనుమతిని ఉల్లంఘించిన అమర రాజా బ్యాటరీస్‌ పరిశ్రమలను మూసివేయాలని ఏపీ పీసీబీకి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో నూనెగుండ్లపల్లి, కరకంబాడి వద్ద గల రెండు పరిశ్రమలనూ మూసివేయాలని పేర్కొంటూ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది.

‘ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్ని చర్యలూ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సైన్యం, ఆస్పత్రులు, టెలికాం రంగాలకు బ్యాటరీల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కంపెనీ ముందు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. కోవిడ్‌ విపత్తు వేళ సున్నిత రంగాలకు సరఫరా దెబ్బతినకుండా అవకాశం ఉన్న అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణకు అమర రాజా సుదీర్ఘకాలంగా అన్ని చర్యలు తీసుకుంటోంది. పలు అవార్డులను కూడా సాధించింది. మేం తీసుకుంటున్న అన్ని చర్యల్ని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు వివరించాం’ అని అమర రాజా సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Kidney Racket Busted in Hyd: హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేధించిన పోలీసులు, అల్కనంద మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు

Raichur Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంత్రాలయ విద్యార్థులు మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ

Andhra Pradesh: వీడియో ఇదిగో, కీలక సమావేశాన్ని వదిలేసి ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన డీఆర్ఓ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు

Share Now