CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, July 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 బాధితుల చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) తెలిపారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం వీటిని ఖర్చు చేయాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకుని మరణాలు తగ్గించడంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలు అమలు చేయండి, ఏపీ సర్కారును ఆదేశించిన సుప్రీంకోర్టు, నిమ్మగడ్డ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరణ

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏపీ సీఎం.. అధికారులతో కోవిడ్‌ సమీక్షా సమావేశాన్ని (CM YS jagan Review Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. అదనంగా మరో 54 ఆస్పత్రులు (New Hospitals) గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స (Coronavirus Treatment) అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో (Covid Hospitals) క్రిటికల్‌ కేర్‌ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

Here's AP CMO Tweet

కొత్తగా తూర్పు గోదావరి జీజీహెచ్, పశ్చిమగోదావరిలో ఆశ్రం, గుంటూరు జీజీహెచ్, అనంతపూర్‌ జీజీహెచ్, శ్రీకాకుళం జీజీహెచ్‌ ఆస్పత్రులను రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులుగా మారుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. తద్వారా క్రిటికల్‌కేర్‌ కోసం 2380 బెడ్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అనంతపూర్, శ్రీకాకుళం తప్ప మిగిలిన మూడు ఆస్పత్రులనూ క్రిటికల్‌ కేర్‌ సేవలు అందించడానికి సిద్ధం చేశామన్నారు. మొత్తంగా 8 ఆస్పత్రులు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులుగా మార్చామన్నారు.

రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ వంటి మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఏపీ సీఎం తెలిపారు. అలాగే క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలపై దృష్టిపెట్టాలని సీఎం చెప్పారు. క్వారంటైన్‌ సెంటర్లలో సేవలపై ప్రతిరోజూ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వెల్లడించారు. కోవిడ్‌ టెస్టులు, క్వారంటైన్‌ సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు.

రాష్ట్రంలో రోజుకు రికార్డు స్థాయిలో 58వేల పరీక్షలు చేస్తున్నామన్నారు. కంటైన్‌ మెంట్‌ క్లస్టర్లు, కోవిడ్‌ సోకడానికి ఆస్కారం అధికంగా ఉన్న వారిపై దృష్టి పెట్టి ఈ పరీక్షలు చేస్తున్నామని, దీనివల్ల పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరిగిందని వివరించారు. దాదాపు 90 శాతం పరీక్షలు వీరికే చేస్తున్నామన్నారు. రానున్న కొన్నిరోజులు కేసుల తీవ్రత ఇలాగే కొనసాగి, తర్వాత తగ్గుముఖం పడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలిపారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై సమీక్ష

పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు కష్ట పడకూడదని, సంబంధిత పంటల విషయంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దీని కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. వచ్చే సీజన్‌ కల్లా ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లి తన క్యాంపు కార్యాలయంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘అరటి, చీనీ, టమోటా రైతులు ప్రతి ఏటా ఆందోళన చెందుతున్నారు. కనీస గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే.. ఎంత మేర కొనుగోలు చేయాలి, ఎంత మేర ఫుడ్‌ప్రాససింగ్‌కు తరలించాలన్నదానిపై అధికారులు దృష్టిపెట్టాలని’’ సీఎం పేర్కొన్నారు. దీని కోసం ఖర్చు ఎంత అయినా పర్వాలేదు.. కాని సమస్యకు పరిష్కారం ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. నెలరోజుల్లోగా దీనికి సంబంధించి కార్యాచరణ పూర్తికావాలన్నారు. అవసరమైన చోట్ల ఆర్బీకేల స్థాయిలోనే ప్రాథమిక స్థాయిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయాలి. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అంచనాలు తయారు చేయాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

నిమ్మ ధరలపై కీలక ఆదేశం

రాష్ట్రంలో నిమ్మ ధరలు పడిపోవడంపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్షించారు. రైతులకు మేలు చేసేలా కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రభుత్వమే నిమ్మ కొనుగోలు చేసి మద్దతు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలిచ్చారు. రేపటి నుంచి నిమ్మ కొనుగోలు చేపడతామని ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. ఏలూరు, గుడివాడతో పాటు నిమ్మ మార్కెట్లలన్నింటిలో కొనుగోలు చేపడుతామని చెప్పారు. రైతుకు మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.



సంబంధిత వార్తలు

Hyderabad Rain Videos: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అవస్థల వీడియోలు ఇవిగో, రెండు గంటల పాటు హడలెత్తించిన వాన, రహదారులన్నీ జలమయం, భారీగా ట్రాఫిక జాం

Telugu States Rain Update: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రానున్న 5 రోజులు పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Andhra Pradesh Elections 2024: ఆకస్మిక బదిలీలే హింసకు కారణం, ఈసీకి నివేదిక సమర్పించిన సీఎస్, డీజీపీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు

CM Jagan on Election Results: ఏపీలో మనం కొట్టే సీట్లతో ప్రశాంత్ కిషోర్ మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి

Covishield Side Effects: కోవిషీల్డ్ టీకాతో ప్రాణాంతక వీఐటీటీ, అరుదైన ప్రాణాంతక రుగ్మతకు దారితీస్తున్న వ్యాక్సిన్, ఆస్ట్రేలియా పరిశోధనలో మరిన్ని కొత్త విషయాలు

Post-Poll Violence In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రక్తపాతం, సీరియస్ అయిన ఈసీ, వివరణ ఇవ్వాలంటూ చీఫ్ సెక్రటరీ & డీజీపీకి సమన్లు ​​జారీ

Andhra Pradesh Elections 2024: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు, పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించారని ఆరోపణలు

Palnadu Road Accident: ప‌ల్నాడులో ప్రైవేట్ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు, ఆరుగురు స‌జీవ ద‌హ‌నం, ఓటు వేసి తిరిగి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా విషాదం