Supreme Court on AP SEC Issue: గవర్నర్ ఆదేశాలు అమలు చేయండి, ఏపీ సర్కారును ఆదేశించిన సుప్రీంకోర్టు, నిమ్మగడ్డ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరణ
Supreme Court of India | Photo-IANS)

Amaravati, July 24: ఏపీ ఎన్నికల అధికారి విషయంలో జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు విచారణ సంధర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ లేఖ పంపినా నిమ్మగడ్డకు పోస్టింగ్ ఇవ్వకపోవడమేంటని సీజేఐ ప్రశ్నించింది. ఏపీ సీఎం చెంతకే మళ్లీ నిమ్మగడ్డ ఫైలు, ఎస్‌ఈసీ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిన గవర్నర్, సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున నిర్ణయం తీసుకోలేమంటున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిమ్మగడ్డను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టులో ఈ కేసు ఉందని... సుప్రీం తీర్పు కోసం తాము వేచి చూస్తున్నామని వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుందో వేచి చూడాలి.

వచ్చే శుక్రవారంలోపు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జడ్జీలను, జడ్జిమెంట్‌లను ఎటాక్ చేస్తున్నారని చెప్పటంతో ఆ క్లిప్పింగ్స్ ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది. కాగా.. ఇటీవల నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం నాడు విచారించిన కోర్టు పై విధంగా జగన్ సర్కార్‌పై మండిపడింది.

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సా్వే వాదనలు వినిపించారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వచ్చినందున స్టే ఇచ్చేందుకు వీలు లేదని కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని హరీశ్ సాల్వే వివరించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అధికార పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేశారని ధర్మాసనంకు తెలియజేశారు.

ఈ నేపథ్యంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన ప్రతి విషయం మాకు తెలుసు మేం కావాలనే స్టే ఇవ్వట్లేదు. గవర్నర్ లేఖ పంపినా రమేష్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వకపోవడమేంటని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించామని ధర్మాసనం తెలియజేసింది. హైకోర్టు తీర్పు తర్వాత పరిణామాలపై అఫిడవిట్ ధాఖలు చేస్తామని నిమ్మగడ్డ తరపు న్యాయవాది తెలిపారు. కాగా పిటిషన్ పై అఫిడవిట్ ధాఖలు చేయడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి వారం రోజులు గడువు ఇచ్చింది.