Insurance Schemes in AP: సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ఆ నాలుగు రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ నెల రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు, బీమా పథకాల వివరాలు ఓ సారి తెలుసుకోండి

నాలుగు రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ను 30 రోజుల్లో పరిష్కరించాలని (4 Insurance Scheme Claims Within one month) స్పష్టం చేసింది.

AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, July 5: పేద కుటుంబాలకు అండగా ఉంటున్న బీమా పథకాల క్లెయిమ్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం (Government of Andhra Pradesh) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ను 30 రోజుల్లో పరిష్కరించాలని (4 Insurance Scheme Claims Within one month) స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యతను జిల్లా జాయింట్‌ కలెక్టర్లకు (గ్రామ, వార్డు సచివాలయాలు–అభివృద్ధి) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

వైఎస్సార్‌ బీమా, రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం చెల్లింపు, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పరిహారం, వైఎస్సార్‌ పశునష్ట పరిహారం పథకాల అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించడమే కాకుండా క్లెయిమ్‌ సొమ్మును సంబంధిత కుటుంబాలకు వారి ఇంటివద్దే వాలంటీర్ల ద్వారా అందించాలని నిర్ణయించింది.

కాగా బీమా క్లెయిమ్స్‌ పరిష్కారంలో తీవ్రజాప్యం జరుగుతుండటాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) వైఎస్సార్‌ బీమా పథకం అమల్లో సమూల మార్పులు తీసుకొచ్చారు. బీమా పరిహార ఆర్థిక సహాయాన్ని (YSR Bima) సకాలంలో అందించడం ద్వారా మరణించిన లేదా బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించాలని వైయస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇప్పటికే అనేక ప్రభుత్వ సేవలను వాలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే అందిస్తున్న తరహాలోనే ఈ బీమా పథకాల పరిహారం కూడా అందించనుంది.

సొంత జిల్లాకు ఏపీ ముఖ్యమంత్రి, జూలై నెల 8, 9వ తేదీల్లో వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్న వైయస్ జగన్, 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన కలెక్టర్‌ సి.హరికిరణ్‌

ఈ క్లెయిమ్‌ల పరిష్కారం విషయమై జాయింట్‌ కలెక్టర్‌ 15 రోజులకోసారి జిల్లా, మండల, పట్టణ స్థానికసంస్థల అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించి కలెక్టర్‌కు నివేదికను ఇవ్వాలని, కలెక్టర్‌ నెలకోసారి సమీక్షించి గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌ నెలవారీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. బీమా పథకాలు సజావుగా సకాలంలో అమలవుతున్నాయా లేదా అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి సమీక్షించనుంది.

ఏపీ ప్రభుత్వానివి నిరాధారమైన ఆరోపణలు, నిబంధనలకు లోబడే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం, కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన ఏపీ ప్రభుత్వం

4 బీమా పథకాలు ఇవే..

1.పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి.. 18 నుంచి 50 ఏళ్ల వయసులోపు సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి లక్ష రూపాయలను పరిహారంగా ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల వయసులోపు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందినా 5 లక్షల రూపాయలను బీమా ద్వారా పరిహారం చెల్లిస్తుంది.

2. వ్యవసాయ కారణాలతో రైతులు, కౌలు రైతులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధిత కుటుంబానికి పునరావాస ప్యాకేజీ కింద రూ.7 లక్షల పరిహారం చెల్లించాలి.

3. చేపలవేట సమయంలో 18 నుంచి 60 ఏళ్ల వయసులోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి.

4. వైఎస్సార్‌ పశునష్ట పరిహార పథకం కింద గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు మరణిస్తే ప్రభుత్వం నిర్ధారించిన పరిహారాన్ని చెల్లించాలి.



సంబంధిత వార్తలు

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

Jagan Slams Chandrababu Govt: పలావు పోయిందీ, బిర్యానీ పోయింది, చంద్రబాబు మీద మండిపడిన వైఎస్ జగన్, విజన్‌ 2047 పేరిట మరో డ్రామా జరుగుతుందని వెల్లడి

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Telangana Assembly Sessions: మంత్రులే ప్రశ్నలు అడుగుతారా?, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్..హరీశ్‌ రావు ఫైర్, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం అన్న మంత్రి ఉత్తమ్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif