Andhra Pradesh High Court: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలన్న ఏపీ హైకోర్టు

దాదాపు మూడుగంటల పాటు వాదనలు విన్న న్యాయస్థానం (Andhra Pradesh High Court) చివరకు తీర్పును వెలువరించింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారెవరైనా కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

AP Govt Offices Shifting Row Andhra Pradesh High Court adjourned Enquiry On Vigilance Commission | (Photo-Twitter)

Amaravati, May 28: లాక్‌డౌన్‌ నిబంధనలు (lockdown violations) ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu), నారా లోకేష్‌తో (Nara Lokseh) పాటు మరికొందరు అయిదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై (YCP MLAS)హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ముగిసింది. దాదాపు మూడుగంటల పాటు వాదనలు విన్న న్యాయస్థానం (Andhra Pradesh High Court) చివరకు తీర్పును వెలువరించింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారెవరైనా కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యం , ఆ 49 మందిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు పెట్టి, నోటీసులు జారీ చేయాలన్న ఏపీ హైకోర్టు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి...ప్రతి ఒక్కరికీ సీరియస్‌నెస్ వుండాలని ధర్మాసనం పేర్కొంది. లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారెవరైనా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేలపై, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలని పిటిషనర్లకు కోర్టు సూచించింది. కరోనా వైరస్‌ కట్డడికి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి విపత్తు నివారణ చట్టం 2005 ప్రకారం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే తొలుత సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఫేక్ వార్తలపై పోలీసుల డేగ కన్ను, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠినచర్యలు తప్పవు, సైబర్‌ క్రైం వింగ్‌లో సోషల్‌ మీడియా నేరాల నియంత్రణ, పర్యవేక్షణకు మరో వింగ్, మీడియాతో డీజీపీ గౌతం సవాంగ్

నేరుగా పిల్ వేయటం మూలంగా వాస్తవ విషయాలపై విచారణ చేయలేమని పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అలాగే నిబంధనల ఉల్లంఘనలపై చట్టం ప్రకారం సంబంధిత శాఖలో ఫిర్యాదు చేసేందుకు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఫిర్యాదులు అందగానే చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాగా, లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఏపి ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్‌ఆర్‌సిపి జెండాను పొలిన రంగులు వేయండంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే రంగులు తొలగించాలంటూ గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విచారణకు ఏపి సీఎస్‌ నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యరద్శి జి.కె.ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌లు హాజరయ్యారు. ప్రభుత్వం తరపు వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఓ కేసు విచారణకు సంబంధించి ఏపి డీజీపీ కూడా ఇటీవల హైకోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే.