Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ పేలుడు, ధ్వంసమైన 10 ఇళ్లు, టపాసుల తయారీకి ఉపయోగించే పదార్థాల కారణంగా పేలుడు

పేలుడు దాటికి ఇల్లంతా ధ్వంసం అయ్యింది. అంతే కాకుండా చుట్టుపక్కల ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి.

Blast |Image used for representative purpose. (Photo Credits: IANS)

West Godavari, September 17: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురులో ఒక ఇంట్లో భారీ పేలుడు (Explosive Material Blasted) సంభవించింది. పేలుడు దాటికి ఇల్లంతా ధ్వంసం అయ్యింది. అంతే కాకుండా చుట్టుపక్కల ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి. టపాసుల తయారీకి ఉపయోగించే పదార్థాల కారణంగానే ఈ పేలుడుు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే, పేలుడు సమయంలో చుట్టు పక్కన ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది.

పేలు సంభవించిన ఇల్లు సూర్యనారాయణ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. అయితే, ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో గ్రామంలో తీవ్ర అలజడి నెలకొంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు సంభవించిన ఇంటిని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఆన్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

మొత్తం 10 ఇళ్లు ( 10 Houses Damaged) ఈ పేలుడు కారణంగా దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో భీమవరం ఉండి రోడ్డులో వరుస పేలుళ్లు సంభవించాయి. ఉండి రోడ్డులో స్కాప్ యార్డులో పేలుడు సంభవించగా.. భారీ నష్టం చోటు చేసుకుంది. ఆ పేలుడు సంభవించిన కొంతసేపటి తరువాత బైపాస్ రోడ్డు మీదుగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ లారీ పేలింది.