Andhra Pradesh: వీడియో ఇదిగో, ఘోర రోడ్డు ప్రమాదంలో 150 గొర్రెలు మృతి, పొగ మంచులో రోడ్డు మీద వెళ్తున్న మందను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
పులిపాడు వద్ద ట్రావెల్ బస్సు ఢీకొని 150 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు.
అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డుపై ఘోరం జరిగింది. పులిపాడు వద్ద ట్రావెల్ బస్సు ఢీకొని 150 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు. గొర్రెల మృతిపై విచారణ వ్యక్తం చేశారు.
క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన గొర్రెలకాపరికి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ట్రావెల్ యజమానులు, డ్రైవర్లతో సమావేశం ఏర్పాట్లు చేసి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, డ్రైవర్లు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని గొట్టిపాటి రవి సూచించారు.
ఘటన ఎలా జరిగిందంటే..
తెలంగాణలోని నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన ఆవుల మల్లేశ్, అతని మామ కర్రెప్ప, మరికొందరు ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో 600 గొర్రెల మందతో పులిపాడు- నడికూడి పంట పొలాల నుంచి పిడుగురాళ్ల వైపు హైవే ఫ్లైఓవర్ మీదుగా మందను తోలుకెళ్తున్నారు.
150 Sheep Dead As Private Bus Rams Into Herd in Palnadu
మంచు కురుస్తున్న ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన శ్రీమారుతి ట్రావెల్స్ బస్సు మందపైకి దూసుకెళ్లింది. సుమారు 85 మీటర్ల మేర గొర్రెలను లాక్కెళ్లింది. టైర్లకు కళేబరాలు చుట్టుకొని, బస్సు ముందుకు కదల్లేక ఆగిపోయింది. కిందకు దిగి చూసిన డ్రైవర్.. పదుల సంఖ్యలో గొర్రెలు చనిపోయి ఉండటాన్ని గుర్తించి, వెంటనే పరారయ్యాడు. ప్రయాణికులు బస్సు దిగి ఘటన చూసి షాక్ కు గురయ్యారు.