Tammineni Sitaram: కరోనా నుంచి కోలుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు, వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ స్పీకర్, కరోనా కష్టకాలంలో రాజకీయ లబ్ది కోసం మాట్లాడటం సరికాదని సూచన
శ్రీకాకుళంలో మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు క్రిటికల్ ట్రీట్‌మెంట్ అందించి (recovers from Covid-19) త్వరంగా కోలుకునేట్టు కృషి చేశారు. కాగా శ్రీకాకుళంలో క్రిటికల్ ట్రీట్‌మెంట్ అందించిన వైద్యులకు కృతజ్ఞతలు స్పీకర్ తెలియచేశారు.
Amaravati, May 12: కరోనా వైరస్ బారిన పడిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం (Assembly speaker Tammineni Sitaram) దంపతులు సంపూర్ణంగా కోలుకున్నారు. శ్రీకాకుళంలో మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు క్రిటికల్ ట్రీట్‌మెంట్ అందించి (recovers from Covid-19) త్వరంగా కోలుకునేట్టు కృషి చేశారు. కాగా శ్రీకాకుళంలో క్రిటికల్ ట్రీట్‌మెంట్ అందించిన వైద్యులకు కృతజ్ఞతలు స్పీకర్ తెలియచేశారు. కరోనావైరస్ రోగులకు అందిస్తున్న వైద్యంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఏపీ స్పీకర్‌గా తనకు ఎటువంటి వైద్యం అందించారో, ఆరోగ్య శ్రీ లబ్దిదారునికి కూడా ఇదే తరహా వైద్యం అందించడాన్ని ఆయన అభినందించారు. కరోనా (Coronavirus) కష్టకాలంలో రాజకీయ లబ్ది కోసం మాట్లాడటం సరికాదని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ప్రజలకు భరోసా ఇవ్వాలి గానీ భయాందోళనలు కలిగించడం మానుకోవాలన్నారు.
శ్రీకాకుళం నుండి ఇంటికి వెళ్తూ ఆసుపత్రి యాజమాన్యానికి, డాక్టర్లకు, సిబ్బందికి, పేరు పేరునా తమ్మినేని సీతారాం, కుటుంబసభ్యులు వినమ్ర నమస్కారాలు తెలియజేశారు.
Here's Updates
ఆయన కొడుకు కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఆయన కుమారుడు వీడియో విడుదల చేశారు. అందరం ఆరోగ్యంగా ఉన్నాం. ఈ నెలాఖరు వరకు ఎవ్వరూ పరామర్శలకు ఇంటికి రావొద్దని ఇది కేవలం అందరి ఆరోగ్యం కోసమేనని వీడియోలో విన్నపం చేశారు. కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని.. నెలాఖరు వరకు అందరూ ఇంట్లోనే ఉండాలని కోరారు. కాగా మే 4వ వతేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.