AP Winter Assembly Session: హాట్ హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సెటైర్లతో నవ్వులు పూయించిన ఆనం, అసెంబ్లీలో వల్లభనేని వంశీ, ఉల్లితో చంద్రబాబు నిరసన, మోడీని మోసం చేశారంటున్న వైసీపీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (AP Winter Assembly Session)హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni sitaram) ప్రారంభించారు. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram MLA Vallabhaneni vamsi) అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో ఆయన చివరి వరసలో కూర్చున్నారు.
Amaravathi,December 9: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (AP Winter Assembly Session)హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni sitaram) ప్రారంభించారు. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram MLA Vallabhaneni vamsi) అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో ఆయన చివరి వరసలో కూర్చున్నారు.
సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇచ్చారు.పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం నిజానిజాలను పరిశీలన చేస్తోందన్నారు. కమిటీ నివేదిక రాగానే అన్ని విషయాలు బయటకు చెబుతామని తెలిపారు. పద్దతి ప్రకారం జరగాలంటే కొంత సమయం పడుతుందని మంత్రి వివరించారు.
ఈ సమావేశాల్లో ప్రధానంగా పీపీఎ, ప్రత్యేక హోదా వంటి అంశాలు చర్చకు వచ్చాయి. సమావేశాలు 9 రోజుల పాటు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అయ్యాయి. అధికార, విపక్షాలు వ్యూహ, ప్రతీవ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యాయి.
వల్లభనేని వంశీ దారెటు ?
టీడీపీకి గుడ్ బై చెప్పిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. టీడీపీ(TDP)కి కేటాయించిన స్థానాల్లో... వెనుక వరుసలో ఆయన కూర్చున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వంశీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తన పొలిటికల్ కెరీర్ ప్రారంభం నుంచి టీడీపీలోనే కొనసాగిన వంశీ చంద్రబాబుపై చేసిన విమర్శలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి.
నవ్వులు పూయించిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాం నారాయణ రెడ్డి
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి (Anam Ramnarayana reddy) దయచేసి నా సీటు మార్చండి అంటూ... స్పీకర్‌కు విన్నవించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తన వద్దకు వస్తే అభ్యంతరం ఉండదని, కానీ, సభ జరుగుతున్న సమయంలోనే ప్రతిపక్ష నేత తన వద్దకు వస్తే ఎలా అని ఆనం ప్రశ్నించారు. ఆయన స్థాయి తనకు లేదని.. తనకు భయం వేస్తోందని ఆనం చెప్పుకొచ్చారు. సభలో ఏ సభ్యుడైనా మధ్యలో మాట్లాడటం సాధారణంగా జరుగుతూనే ఉంటుందని అయితే అందుకు చంద్రబాబు తనను అరాచక శక్తి అంటూ వ్యాఖ్యానించటం సరి కాదని వివరించారు.
దీంతో స్పీకర్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలిగిస్తున్నట్లు రూలింగ్ ఇచ్చారు. అయితే, దీనికి అంబటి రాంబాబు సైతం స్పందించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉంటూ తమ పార్టీకి చెందిన సీనియర్ సభ్యుడు అయిన ఆనం సీటు వద్దకు ఎలా వెళ్తారని..అచ్చెన్నాయుడు అడ్డు రాకుంటే చంద్రబాబు ఏం చేసేవారో అంటూ ఎద్దేవా చేసారు.
పార్టీలో ఎవరైనా క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తే కఠినంగా ఉంటానంటూనే.. ఆనం చేసిన వ్యాఖ్యల మీద సీరియస్ అయిన జగన్ (AP CM YS Jagan) సభలో మాత్రం ఆనం మాట్లాడుతున్నంత సేపు నవ్వుతూ కనిపించారు. ఆనం సభలో పూర్తిగా ప్రభుత్వానికి మద్దతుగా తన వాదన వినిపించారు. అదే సమయంలో చంద్రబాబు తన సీటులో నుండి లేచి ఆనంకు దగ్గరగా రావటంతో ఆ సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అధినేత పైన సెటైరికల్ కామెంట్లు చేసారు. దీంతో..ఆనం మాట్లాడుతుండగా.. సీఎం జగన్ నవ్వుతూ కనిపించారు. ఇక, దీని ద్వారా పార్టీలో ఆనం పైన వ్యతిరేకంగా సాగిన చర్చ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది.
ఉల్లి ధరలపై నిరసన
ఉల్లి ధరల పెంపుపై వినూత్నంగా నిరసన తెలిపిన టీడీపీ
తొలి రోజు ప్రతిపక్షం టీడీపీ ఉల్లి, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై వినూత్నంగా నిరసన తెలిపింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెడలో ఉల్లిపాయ దండలతో అసెంబ్లీకి వచ్చారు.. ప్లకార్డులతో నిరసనను తెలిపారు. అసెంబ్లీ గేటు దగ్గర భద్రతా సిబ్బంది టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ఉల్లి దండలు, ప్లకార్డులకు అనుమతి లేదన్నారు.
దీంతో పోలీసులతో టీడీపీ ఎమ్మెల్యేల వాగ్వాదం జరిగింది. అంతకముందు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఉల్లి ధరలపై వినూత్నంగా తమ నిరసనను తెలియజేశారు. ప్రధానంగా ఉల్లి, నిత్యావసర వస్తువుల ధరల పెంపు అంశంపై అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రతిపక్షం టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)