Sujana and Rayapati: వేలానికి సుజనా చౌదరి, రాయపాటి ఆస్తులు, రాయపాటి ఆస్తులను వేలం వేయనున్న ఆంధ్రా బ్యాంక్, సుజనా చౌదరి ఆస్తుల వేలానికి నోటీసులు పంపిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

వారికి సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి.

Banks to auction properties of Rayapati Sambasiva Rao, Sujana Chowdary (Photo-FB)

Amaravati, Febuary 22: తెలుగు దేశం పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ సుజనాచౌదరి (Yalamanchili Satyanarayana Chowdary), అలాగే టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావులకు (Rayapati Sambasiva Rao) భారీ షాక్ తగిలింది. వారికి సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి.

ఆస్తుల వివరాలను వెల్లడించిన మాజీ సీఎం

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను వేలం వేయడానికి ఆంధ్రాబ్యాంకు (Andhra Bank) సన్నాహాలు చేస్తోంది. గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయననకు సంబంధించిన ఆస్తులను మార్చి 23వ తేదీన వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. రూ. 837.37 కోట్ల రుణాలు చెల్లించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మరోవైపు టీడీపీ నుంచి బీజేపీలో జంప్ అయిన ఎంపీ సుజనా చౌదరికి కూడా..బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. సుజనా గ్రూప్ రూ. 400 కోట్లు రుణం తీసుకున్నారని... లోన్ డీ ఫాల్ట్ కిందకు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది. రుణాలు తీసుకున్న వారికి, గ్యారెంటీ ఇచ్చిన వారికి నోటీసులు జారీ చేసింది.

గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు

రాయపాటి ఆస్తులు వేలం

టీడీపీ నేత రాయపాటికి సంబంధించి.. గుంటూరు జిల్లాలోని అరండల్ పేటలోని 22 వేల 500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న వాణిజ్య భవనం, న్యూఢిల్లీలోని ప్లాట్ను వేలం వేస్తున్నట్లు తెలిపింది. ట్రాన్స్ ట్రాయ్ ఇండియాతో పాటు చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి లక్ష్మీ పేరిట సాంబశివరావు రుణం తీసుకున్నారని తెలిపింది. అయితే...గుంటూరు భవనం ఆస్తి విలువ రూ. 16.44 కోట్లు, ఢిల్లీలోని ప్లాట్ విలువ రూ. 1.09 కోట్లుగా నిర్ధారించింది. మిగిలిన వివరాల కోసం ఆంధ్రాబ్యాంకు వెబ్ సైట్ లేదా టెండర్స్ డాట్ గవ్ డాట్ ఇన్ ను సంప్రదించాలని ప్రకటనలో వెల్లడించారు.

బాబుకు జడ్ ప్లస్ భద్రత ఇస్తున్నాం

కాగా ఇటీవలే రాయపాటిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రూ.16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియాకు మళ్లించినట్లుగా ఈడీ గుర్తించింది. రాయపాటితో పాటు ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలపై ఇప్పటికే సీబీఐ కేసులు నమోదు చేసింది.

గంటన్నర పాటు ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైయస్ జగన్ భేటీ

సింగపూర్, మలేషియా, రష్యాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లుగా అభియోగాలున్నాయి. ఈ రుణానికి పూచీకత్తుగా నారయ్యచౌదరి, రంగారావు, దేవికారాణి, రాయపాటి జగదీష్‌, రాయపాటి జీవన్, లక్ష్మి, జగన్‌మోహన్‌ యలమంచలి, సీహెచ్‌ వాణి ఉన్నారు. ఈ వేలాానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆంధ్రా బ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా టెండర్స్‌ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌ను సంప్రదించాల్సిందిగా బ్యాంకు ప్రకటనలో పేర్కొంది.

సుజనా చౌదరి కంపెనీకి నోటీసులు

ఇక సుజనాకు చెందిన రూ.400కోట్లు విలువైన ఆస్తుల వేలానికి బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (Bank Of India) చెందిన చెన్నై కార్పొరేట్ బ్రాంచ్ ఈ నోటీసులు జారీ చేసింది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న రుణ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఆ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయనున్నట్లు బ్యాంక్ నోటీసుల్లో తెలిపింది. రుణం జమానతు ఇచ్చిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు బ్యాంక్ చెబుతోంది.

ఏపీ పోలీస్ శాఖకు 5 జాతీయ అవార్డులు

సుజనా యూనివర్సల్ కంపెనీ తీసుకున్న బ్యాంక్ లోన్లకు గ్యారెంటీ సంతకాలు పెట్టిన సుజనా చౌదరి, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, వై.శివలింగ ప్రసాద్ (లేట్), వై.జితిన్ కుమార్, వై.శివరామకృష్ణ. ఎస్టీ ప్రసాద్, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్, సుజనా కేపిటల్ సర్వీసెస్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్, నియోన్ టవర్స్, సార్క్ నెట్ లిమిటెడ్ సంస్తల పేర్లను బ్యాంక్ తెలిపింది.

అమిత్ షాతో భేటిలో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ సీఎం వైయస్ జగన్

మార్చి 20న ఉదయం 11 గంటల నుంచి మ. 3 గంటల వరకు ఆస్తుల్ని ప్రత్యక్షంగా పరిశీలించవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసుల్లో వెల్లడించింది. మార్చి 21న టెండర్లు దాఖలు చేయాలని కోరిన బ్యాంక్.. మార్చి 23 ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ ఆక్షన్ నిర్వహించనుంది.