Govt to downgrade Chandrababu Naidu's security cover: Andhra Pradesh DGP (Photo-Instgram)

Amaravati, Febuary 19: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (TDP chief N Chandrababu Naidu) భద్రతకు సంబంధించి ఏపీ డీజీపీ కార్యాలయం (AP DGP Office) కీలక ప్రకటన చేసింది.   చంద్రబాబు భద్రతను కుదించారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఏపీ డీజీపీ కార్యాలయం కొట్టేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతలో (Chandrababu Naidu's Security Cover)ఎలాంటి మార్పు జరగలేదని, దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నట్లు పేర్కొంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

సెక్యూరిటీ రివ్యూలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేశామని, ప్రస్తుతం చంద్రబాబుకు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ (Z plus security) కల్పిస్తున్నట్టు వివరించింది. ఆయనకు మొత్తం 183 మందితో భద్రత కల్పిస్తున్నామని, ఇందులో 135 మందితో విజయవాడలో, 48 మందితో హైదరాబాద్‌లో భద్రత కల్పిస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది.

గంటన్నర పాటు ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైయస్ జగన్ భేటీ

ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చంద్రబాబు, లోకేశ్ భద్రతను తగ్గించిందని టీడీపీ ఆరోపించింది. చంద్రబాబుకు టెర్రరిస్టులు, మావోయిస్టులు, స్మగ్లర్ల నుంచి ముప్పు పొంచి వుందని, అందుకే NSG, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రతను సగానికి సగం కుదించిందని ఆరోపించిన నేపథ్యంలో ఏపీ డీజీపీ కార్యాలయం స్పందించింది.

Here's The ANI Tweet

టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభం అయింది. నెల రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 45రోజుల పాటు టీడీపీ ప్రజా చైతన్య బస్సుయాత్రను చేయనుంది.