AP Cabinet Meeting Highlights: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్‌ ఆమోదం, మధ్యాహ్నం 12 గంటల తర్వాత అన్నీ బంద్, కేబినెట్ ఆమోదం పొందిన పలు నిర్ణయాలు ఇవే..

రాష్ట్రవ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అంగీకారం. పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని మంత్రి తెలిపారు.

Andhra Pradesh Transport Minister Perni Nani(photo-Twitter)

Amaravati, May 4: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ సమావేశం (AP Cabinet Meeting) ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు (AP Cabinet Meeting Highlights) తీసుకున్నారు. సమావేశం అనంతరం రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తెలిపారు.

ఈ సమావేశంలో కరోనా కట్టడి కోసం బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పగటి పూట కర్ఫ్యూ సహా పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించామని బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు, ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని మంత్రి పేర్ని నాని ( Perni Venkataramaiah ) తెలిపారు.

ఉ.6 గంటల నుంచి మ.12 వరకే షాపులకు అనుమతి. 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం. అంతరాష్ట్ర సర్వీసులు కూడా రద్దు చేశారు. మే 13న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేయనున్నారు. దీనివల్ల 54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక మే 25న వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా నగదు జమ. దీని వల్ల 38 లక్షల మంది రైతులకు లబ్ధి జరగనుంది. మే 18న వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా నగదు జమ. వేటకెళ్లే మత్స్యకారులకు రూ.10వేల చొప్పున సాయం.

ఈ ఏరియాలో ప్రవేశం నిషిద్ధం, కరోనా ప్రభావిత ప్రాంతాల్లో బోర్డులను ఏర్పాటు చేసిన ఏపీ పోలీసులు, వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లకు మాత్రమే ఆ ప్రాంతాల్లో అనుమతి

7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అంగీకారం. పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని మంత్రి తెలిపారు.

పాఠశాల విద్య కోసం ప్రపంచబ్యాంక్‌ నుంచి రూ.1860 కోట్ల అప్పు తీసుకున్నాం అని పేర్ని నాని తెలిపారు. ‘‘2.5 శాతం స్వల్ప వడ్డీతో రుణం తీసుకున్నాం. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో అరకొర చదువులు చెప్తున్నారు. ఎయిడెడ్‌ సంస్థలు ప్రభుత్వానికి అప్పగిస్తే మంచిది. ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తుంది’’ అని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రైవేట్‌ యూనివర్శిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాకు ఇవ్వాలి. ఆ సీట్లకు ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు ప్రభుత్వమే ఇస్తుంది అన్నారు.

ఏపీలో కొత్త స్ట్రెయిన్ లేదు, N440K వేరియంట్ న్యూస్ అంతా అబద్దం, సోషల్ మీడియా వార్తలపై స్పందించిన ఆరోగ్యశాఖ, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఏపీలో మూసేసిన సహకార డెయిరీలను అమూల్‌కు లీజుకివ్వడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. 708 గ్రామాల్లో అమూల్‌ సేవలు విస్తరిస్తామని తెలిపారు. ఇక ఏ కేటగిరి ఆలయాల్లో అర్చకులకు రూ.15వేల గౌరవ వేతనం. బీ కేటగిరి ఆలయాల్లో రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దాంతో పాటు ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంపు.. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంపుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.

పట్టా రైతులతో సమానంగా అసైన్డ్‌దారులకు కూడా భూ సేకరణ పరిహారం ఇవ్వనున్నారు. రూ.511.79 కోట్లతో 176 పీహెచ్‌సీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రతి ఏజెన్సీ మండలానికి మూడు పీహెచ్‌సీలు. ప్రతి పాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు డాక్టర్లు, 104 వాహనం ఇవ్వనున్నారు. ఏలేరు-తాండవ లింక్ కెనాల్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

గుడ్ న్యూస్..ఏపీలో తగ్గుముఖం పడుతున్న కేసులు, తాజాగా 18,972 మందికి కరోనా, 71 మంది కోవిడ్19తో మృతి, ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కరోనా కట్టడికి కేబినెట్‌లో విస్తృతంగా చర్చించామన్నారు.‘‘24 గంటల్లోనే కరోనా టెస్ట్‌ రిపోర్ట్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 26వేల ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. ఇప్పటివరకు కోటి 67వేల మందికి కరోనా పరీక్షలు చేశాం. ప్రతి మండల కేంద్రంలో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. 558 ఆస్పత్రుల్లో కోవిడ్‌ వైద్య సేవలు అందిస్తున్నాం. 100కుపైగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కోవిడ్‌ బాధితుల కోసం 44, 599 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక, ఒడిశా, చెన్నై, విశాఖ నుంచి ఆక్సిజన్‌ తీసుకొస్తున్నాం. రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను కూడా అందుబాటులో ఉంచుతున్నాం’’ అని మంత్రి తెలిపారు.

‘‘కోవిడ్‌ కట్టడికి ప్రజలు స్వీయనిర్బంధం పాటించాలి. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం. 45 ఏళ్లు పైబడ్డ వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటివరకు 81.66 శాతం హెల్త్‌ వర్కర్లకు.. 76 శాతం ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌’’ చేశాం అని మంత్రి తెలిపారు.