AP Covid Update: ఏపీలో కొత్త స్ట్రెయిన్ లేదు, N440K వేరియంట్ న్యూస్ అంతా అబద్దం, సోషల్ మీడియా వార్తలపై స్పందించిన ఆరోగ్యశాఖ, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌
coronavirus Test Representational Image. (File Photo | PTI)

Amaravati, May 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి కరోనా కొత్త స్ట్రెయిన్‌ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ప్రస్తుతమున్న స్ట్రెయిన్‌ గతేడాది జూలై నుంచే రాష్ట్రంలో ఉందన్నారు. సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కూడా కొత్త స్ట్రెయిన్‌ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు.

ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్‌ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గత కొన్ని వారాలలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఇన్‌ఫెక్షన్లు పెరగడానికి N440K వేరియంట్ (No need to panic over N440K variant of COVID-19 in AP) కారణమంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. కర్నూల్ సిటీలో ఎన్ 440 కె వేరియంట్ (N440K strain) వల్లే కేసులు పెరిగాయని ప్రచారం చేశారు.

ఈ మేరకు ఆయన (Anilkumar singhal) సోమవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త స్ట్రెయిన్‌ వల్లే కోవిడ్‌ కేసులు (New Covid Strain) పెరుగుతున్నాయనడం సరికాదన్నారు. రాబోయే వారాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలలో 20-30 శాతం శాంపిల్స్‌లో లభించిన ఎన్‌440 కె స్ట్రెయిన్ పూర్తిగా కనమరుగవుతుందని తెలిపారు.

కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను పాటిస్తే కరోనాకు (Covid situation in Andhra pradesh) అడ్డుకట్ట వేయొచ్చన్నారు. రాష్ట్రంలో 24 గంటల్లో 1,15,275 కరోనా పరీక్షలు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 447 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను వినియోగించాం. రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.

కరోనా నుంచి ఊపిరి పీల్చుకున్న ముంబై, భారీగా తగ్గిన కేసులు, దేశంలో తాజాగా 3,57,229 మందికి కరోనా, 3,449 మంది మృతి, భారత్‌లో 2,02,82,833కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

ఆక్సిజన్‌ స్టోరేజ్, రవాణాకు కావాల్సిన క్రయోజనిక్‌ ట్యాంకర్లు, ఇతర పరికరాల కొనుగోలుపై చర్చించాం. అన్ని బోధన, ప్రభుత్వాస్పత్రుల్లో పీఎస్‌ఏ (ప్రెజర్‌ స్వింగ్‌ అడ్సార్ప్‌షన్‌) ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాం. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన పరికరాలు, పైప్‌లైన్ల కొనుగోలుకు మూడు నాలుగు రోజుల్లో టెండర్లు ఖరారు చేస్తామని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో బుధవారం నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంటుంది.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు వ్యాపారాలకు, సాధారణ జీవనానికి ఎటువంటి ఆటంకాలు, ఆంక్షలు ఉండవు. ఎక్కడా ఐదుగురు కంటే ఎక్కువమంది గుమికూడకుండా ఉదయం వేళల్లో144 సెక్షన్‌ అమలు చేస్తాం. నిత్యావసరాలు, ఇతర సరుకులు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. వైద్య సేవలు, అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపులుంటాయి. మీడియా, ఉద్యోగులకు కూడా ఎటువంటి ఆటంకం ఉండదని తెలిపారు.

గుడ్ న్యూస్..ఏపీలో తగ్గుముఖం పడుతున్న కేసులు, తాజాగా 18,972 మందికి కరోనా, 71 మంది కోవిడ్19తో మృతి, ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

కాగా కోవిడ్ -19 - బి .1.617 యొక్క కొత్త వేరియంట్‌ను 'డబుల్ మ్యూటాంట్' లేదా 'ఇండియన్ వేరియంట్' అని పిలుస్తారు. ముసుగు ధరించడం, శారీరక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత మరియు సరైన పారిశుధ్యం వంటి కోవిడ్ తగిన ప్రవర్తనను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) సలహాదారు రాకేశ్ మిశ్రా సూచించారు. ఇదిలా ఉంటే ప్రారంభంలో మహారాష్ట్రలో అనేక సందర్భాల్లో కనుగొనబడిన డబుల్ మ్యూటెంట్ కరోనావైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లోని నమూనాలలో ఎక్కువగా కనుగొనబడింది.

ఏపీలో మే 5 నుంచి డే కర్ప్యూ, రెండు వారాల పాటు కర్ఫ్యూ అమల్లోకి, ఉదయం 6 నుంచి 12 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు

B.1.617 వేరియంట్లో E484Q మరియు L452R అనే రెండు వేర్వేరు వైరస్ వేరియంట్ల నుండి ఉత్పరివర్తనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు తమ అధ్యయనాన్ని డబుల్ మ్యూటెంట్ పై కేంద్రీకరిస్తున్నారు మరియు రెండవ వేవ్ సమయంలో కోవిడ్ కేసులు పెరగడానికి కారణం ఇదేనా అని తెలుసుకోవడానికి నమూనాలను చూస్తున్నారు.