AP Cabinet Meeting: ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ మీటింగ్, పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న ఏపీ సీఎం జగన్, సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఏపీలో పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి

ఈ కేబినెట్‌ బేటీలో సీఎం జగన్‌ (Chief Minister YS Jagan Mohan Reddy) పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నూతన పారిశ్రామిక విధానానికి ఈ కేబినెట్‌ బేటీలో (Andhra Pradesh Cabinet) ఆమోదం తెలపనున్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంపై చర్చించడంతో పాటు .. నవరత్నాల్లో మరో హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది.

ap-capital-cabinet-approves-high-power-committee (Photo-Facebook)

Amaravati, August 18: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ప్రారంభమైంది. ఈ కేబినెట్‌ బేటీలో సీఎం జగన్‌ (Chief Minister YS Jagan Mohan Reddy) పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నూతన పారిశ్రామిక విధానానికి ఈ కేబినెట్‌ బేటీలో (Andhra Pradesh Cabinet) ఆమోదం తెలపనున్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంపై చర్చించడంతో పాటు .. నవరత్నాల్లో మరో హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది.

ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానం, టూరిజం పాలసీకి ఆమోదం తెలపనుంది. అలాగే రాజధాని భూముల కుంభకోణంపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం, పాలనా వికేంద్రీకరణ బిల్లు, ఇళ్ల పట్టాల పంపిణీ, న్యాయపరమైన సమస్యలు, గోదావరి వరదలు, కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై కేబినెట్ చర్చించనుంది. కాగా కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించే అవకాశముంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాల గెజిట్ నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై కేబినెట్ చర్చ జరపనుంది.  ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు, తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా

ఏపీలో బారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌ పంటల పరిస్థితిపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. కొత్తగా బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. డిసెంబర్ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ, వైఎస్ఆర్ బీమాపై చర్చతో పాటు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభంపై చర్చ జరగనుంది. కాగా సెప్టెంబర్‌ 5న ఇచ్చే వైఎస్‌ఆర్‌ విద్యాకానుకకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. ఏపీలో మూడు లక్షలు దాటిన కోవిడ్ కేసులు, ఒక్కరోజే 9,211మంది డిశ్చార్జ్, గత 24 గంటల్లో 9,652 మందికి కరోనా, 2820కి చేరుకున్న మరణాల సంఖ్య

రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కి ఆమోదం తెలపడంతో పాటు కడప జిల్లా కొప్పర్తి లో ఎలక్ట్రానిక్ మనుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు పై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే భావనపాడు పోర్ట్ ఫేజ్ 1 నిర్మాణానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది.

పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి

కాగా సెప్టెంబర్ మొదటివారం నుంచి పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతినిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 20న పర్యాటక రంగ నూతన పాలసీని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. త్వరలో సింహాచల దేవస్థానంలో 'ప్రసాద్‌' పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

కొండపల్లి ఫోర్ట్‌, బాపు మ్యూజియంలను సీఎం జగన్ ప్రారంభిస్తారు పేర్కొన్నారు. తొట్లకొండలో బుద్ధుని మ్యూజియం, మెడిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు వైఎస్ఆర్‌ క్రీడా పురస్కారాలు అందజేస్తామన్నారు. పీపీఈ పద్ధతిలో రాష్ట్రంలో మూడు ఇంటర్నేషనల్ స్టేడియంలను ఏర్పాటు చేస్తామని అవంతి తెలిపారు.