Amaravati, August 18: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 లక్షలు (AP Coronavirus Report) దాటింది. 24 గంటల వ్యవధిలో9652 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 306261 కి పెరిగింది. కాగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజు 9,211మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,18,311కి చేరింది. కరనా బారినపడి గడచిన 24 గంటల్లో 88 మంది మృతి (Covid Deaths) చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2820కి చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 29,61,611 పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 85,130 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
24 గంటల్లో చిత్తూరులో 14, ప్రకాశం 11, అనంతపూర్ 9, గుంటూరు 9, కర్నూలు 9, నెల్లూరు 7, పశ్చిమగోదావరి 6, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 5, విజయనగరం 5, తూర్పుగోదావరి 4, కృష్ణాలో 3, కడపలో ఒకరు కరోనాతో చనిపోయారు. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1396 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు 990, విశాఖపట్నం 928, గుంటూరు 895, కర్నూలు 830, పశ్చిమ గోదావరి 805, కడప 755, ప్రకాశం 725, నెల్లూరు 684, విజయనగరం 513, అనంతపూర్ 445, శ్రీకాకుళం 405, కృష్ణా 281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాకు తోడయిన స్వైన్ ఫ్లూ, దేశంలో ఇప్పటివరకు 2,721 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు, తెలంగాణలో 443 కేసులు నమోదు, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిఫుణులు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా గుంటూరు (306), కర్నూలు (306) జిల్లాల్లో కరోనా మరణాలు నమోదయ్యాయి. తూర్పుగోదావరి (290), చిత్తూరు (257), అనంతపురం (238), కృష్ణా (232), విశాఖపట్నం (216), పశ్చిమ గోదావరి (208), ప్రకాశం (185), శ్రీకాకుళం (176), నెల్లూరు (155), విజయనగరం (126), కడపలో 125 మంది చనిపోయారు.
AP Covid Report
#COVIDUpdates: 18/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 3,03,366 పాజిటివ్ కేసు లకు గాను
*2,15,416 మంది డిశ్చార్జ్ కాగా
*2,820 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 85,130#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/mK5ZXXagVO
— ArogyaAndhra (@ArogyaAndhra) August 18, 2020
దేశంలో అత్యధికంగా తమిళనాడులో 3778778 కరోనా టెస్టులు చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 3208735 టెస్టులు చేశారు. ఆ తర్వాత మూడోస్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 29,61,611 కరోనా టెస్టులు చేశారు. ప్రతి 10 లక్షల జనాభాకు 55461 కరోనా టెస్టులు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో కరోనా పాజిటివ్ రేట్ 10.34 శాతంగా ఉంది. దేశంలో ఈ కరోనా పాజిటివ్ రేట్ 18.83 శాతం మహారాష్ట్రలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ (12.25 శాతం) కర్ణాటక (11.24 శాతం), తమిళనాడులో 9.10శాతం ఉంది.