AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, జగనన్న అమ్మ ఒడి పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం, పలు కీలక అంశాలను చర్చించనున్న మంత్రివర్గం
ఈ సమావేశంలో పలు కీలక పథకాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా రెండో విడత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి ( Jagananna Amma Vodi) గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు.
Amaravati, Dec 18: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక పథకాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా రెండో విడత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి ( Jagananna Amma Vodi) గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది జనవరి 9వ తేదీన తొలి విడత జగనన్న అమ్మ ఒడి పథకం అమలు చేయగా... వరుసగా రెండో విడత మళ్లీ వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన అర్హులైన తల్లులకు (AP AMMA VODI SCHEME 2020) రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గ సమావేశంలో అమోదించనున్నారు.
సంపూర్ణ అక్షరాస్యత సాధించడంతో పాటు.. పేద వర్గాల పిల్లలను పనులకు పంపకుండా బడికి పంపేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి విదితమే. అలాగే సంక్రాంతికి ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ఆర్థిక సాయం అందించడంపై ఈ మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తారు. నియోజవర్గాల్లో పశువుల ఆరోగ్య పరీక్షల ల్యాబ్‌లు ఏర్పాటుతో పాటు పలు అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములిచ్చిన వారిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.
దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీని ఆమోదించనున్న ఏపీ కేబినెట్ ఆమోదించనుంది. 6 జిల్లాల్లో వాటర్‌షెడ్‌ల అభివృద్ధి పథకం అమలుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటుగా రైతు భరోసా కింద మరో విడత చెల్లింపులపై చర్చించే అవకాశం ఉంది.