Andhra Pradesh: టెక్నాలజీ రంగంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌టవర్లను ప్రారంభించిన సీఎం జగన్

మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు సెల్ టవర్లను (300 cell towers in remote tribal areas ) ఏర్పాటు చేసింది.

YS Jagan Mohan Reddy (Photo/AP CMO)

Vjy, Jan 24: ఏపీ ప్రభుత్వం డిజిటల్ రంగంలో మరో ముందడుగు వేసింది. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు సెల్ టవర్లను (300 cell towers in remote tribal areas ) ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 300 సెల్‌టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి (YS. Jagan Mohan Reddy) గురువారం ప్రారంభించారు. ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్‌ ఏర్పాటయ్యాయి.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘దాదాపు 400 కోట్లు ఖర్చుతో ఇవాళ 300 టవర్లు, జూన్‌లో 100 టవర్లు ఏర్పాటు చేశారు.ఈ 400 టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరంగా ఉండబోతోంది. ఇవాళ ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగం కలగనుందని తెలిపారు. మొత్తంగా కలిపి 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 3,119 కోట్లు ఖర్చు చేస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. వీడియో ఇదిగో, వైఎస్‌ కుటుంబం చీలిందంటే దానికి జగనన్నే కారణం, కాకినాడలో షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఈ టవర్లకు అవసరమైన భూములను వెంటనే అప్పగించడం జరిగింది. మొత్తం 5,549 గ్రామాలకు ఈ టవర్ల ద్వారా పూర్తి మొబైల్‌ టెలికాం సేవలు అందుతాయి. అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్‌వర్క్‌ పరిధిలోకి వస్తాయి. సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయి. ఈ ప్రాంతాలకు పథకాల అమలు మరింత సులభతరం అవుతుంది. వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌, ఇంగ్లిషు మీడియం స్కూల్స్‌ ఇవన్నీకూడా గ్రామ రూపురేఖలను మారుస్తాయి. ఈ ప్రాంతాల్లో టెలికాం సేవలు కారణంగా ఇవి మరింత బలోపేతంగా నడుస్తాయి’’ అని సీఎం తెలిపారు.

ఇప్పటికిప్పుడు సీఎం పదవి దిగిపోయినా బాధపడను, సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్‌ నీచ రాజకీయాలతో మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోందని మండిపాటు

ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్‌ (ఐటీశాఖ) డైరెక్టర్‌ సి చంద్రశేఖర్‌ రెడ్డి, భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్‌ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.