రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress) చీల్చిందంటూ బుధవారం జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం.. చేజేతులా జగనన్న చేసుకున్నదే. అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ. వైసీపీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారు.
పార్టీ కోసం నెలల తరబడి 3,200కి.మీ పాదయాత్ర చేశా. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టా. సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర కొనసాగించా. ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు స్వలాభం చూసుకోకుండా జగనన్న గెలుపుకోసం అండగా నిలబడి ప్రచారం చేశా’’ అని షర్మిల గుర్తుచేశారు.అభివృద్ధి లేకుండా ఆంధ్రప్రదేశ్ దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం సీఎం జగనేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు.
Here's Video
గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఎంతో కృషి చేశాను#YSSharmila #yssharmilacomments #CMJagan #apcongress #sharmilavsjagan #congressvsycp #10TV pic.twitter.com/XSWUkPgAez
— 10Tv News (@10TvTeluguNews) January 25, 2024
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలల ప్రాజెక్టు పోలవరమని షర్మిల తెలిపారు. 1941లో దాన్ని నిర్మించాలనుకుంటే ఏ నాయకుడూ సాహసం చేయలేదని.. వైఎస్ సీఎం అయిన 6 నెలల్లోనే శంకుస్థాపన చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.