CM Chandrababu on Andhra Pradesh Debt: ఆంధ్రప్రదేశ్ అప్పు నేటికి రూ.9.74 లక్షల కోట్లు, ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల (White paper on State Debt) చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46 శాతం అని వెల్లడించారు
Vjy, July 26: ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల (White paper on State Debt) చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46 శాతం అని వెల్లడించారు. అదే సమయంలో 58 శాతం జనాభా ఉంది. అక్కడ్నించే సమస్యలు ప్రారంభం అయ్యాయని, ఆస్తులు హైదరాబాదులో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు.
అయిదేళ్ల పాటు పట్టిసీమను ఆపరేట్ చేయలేదని వెల్లడించారు. గోదావరి ఉన్నంత వరకూ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదన్నారు. అయితే ఆ పరిస్థితి కూడా తెచ్చిన వ్యక్తి నాటి పాలకుడు అని పేర్కొన్నారు. పోలవరంకు మా హయాంలో రూ. 15,364 కోట్లు ఖర్చు చేశామని.. అదే టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే ఈ పాటికే ప్రాజెక్టు ఆపరేషన్ లో ఉండేదన్నారు. కేంద్రం వేసిన ఎక్సఫర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్యారలల్‌గా కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని అత్యవసర క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో రూ. 990 కోట్లు దీనికోసం ఖర్చే చేయాల్సి వస్తోందని చంద్రబాబు (Andhra Prdesh CM Chandrababu Naidu) పేర్కొన్నారు. ఏపీ అప్పులపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్, చంద్రబాబు రూ .14 లక్షల కోట్ల శ్వేతపత్రంపై సెటైర్లు, ఇంతకీ ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంతంటే..
రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువ. సేవల రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. సేవల రంగం తెలంగాణకు వెళితే, ఏపీకి వ్యవసాయం వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువగా ఉంటుంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం రూ.95 వేలుగా ఉంది. విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం రూ.93,903. అదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104కి పెరిగింది.
న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ అమరావతి... ఈ ప్రాజెక్టును చూస్తే కొత్తనగరాలు ఆవశ్యకత ఎంతో ఉందని చంద్రబాబు తెలిపారు. అమరావతి ఇదే స్పీడ్‌లో ఆర్టీఫిషియల్ ఇంటిలలిజెన్స్ సిటీ గా తయారై ఉండేదని.. కానీ దాన్ని దుర్మార్గులు దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. ఒక్క వివాదం లేకుండా రైతులు ల్యాండ్ ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ అంటే పాకిస్ధాన్ హైదరాబాదా?.. ఇండియా హైదరాబాదా? అని అడిగేవారని చంద్రబాబు అన్నారు. ఇప్పడు హైదరాబాద్ అంటే ఇండియాలోని హైదరాబాద్ మాత్రమే అని అందరూ గుర్తించారన్నారు. 7 లక్షల మంది ఉద్యోగులు అమరావతిలో ఉండేవారని... 3 నుంచి నాలుగు లక్షల కోట్ల ఆస్తి అమరావతితో వచ్చేదని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ అధినేత సూపర్ ఫార్ములా, జనసేన - బీజేపీకి న్యాయం చేస్తూనే, తెలుగు తమ్ముళ్లకు ధీమా ఇచ్చేలా, చంద్రబాబు మార్క్!
2014-19 మధ్య తలసరి ఆదాయం 13. 2 శాతం పెరిగిందన్నారు. 2019 ప్రారంభం నుంచి ఇప్పటికి చాలా అధ్వాన్న మైన పరిస్ధితికి (CM Chandrababu on Andhra Pradesh Debt) వచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. 5.7 శాతం వ్యవసాయ గ్రోత్ రేట్ అయిదేళ్లలో తగ్గిపోయిందన్నారు. సర్వీస్ సెక్టార్ సుమారు 2 శాతం తగ్గిందన్నారు. గ్రోత్ రేట్ 3శాతం తగ్గిపోయిందన్నారు. పవర్ సెక్టార్ లోనే లక్షా 29 వేల కోట్లు అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి వీరి నిర్వాకం వల్ల వచ్చిందన్నారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంలు ఉపయోగిచుకోకుండా ఉండడంతో నిధులు నిలిచిపోయాయన్నారు.
వరుసగా విద్యుత్, ఆర్టీసీ, టాక్స్‌లు, ఇసుక, చెత్తపన్నులు కూడా వేశారన్నారు. ఇప్పటి వరకూ 9 లక్షల 74 వేల కోట్లు అప్పు అయ్యిందన్నారు. ఇది నేటకి ఉన్న రాష్ట్ర అప్పు అని చంద్రబాబు తెలిపారు. దీంతో తలసరి అప్పు లక్షా 44వేల 336 రూపాయలకు చేరిందన్నారు. ఇది టీడీపీ హయాంలో 74,790 ఉండేదన్నారు. దీంతో అప్పు వైసీపీ పాలనలో డబుల్ అయ్యందని చంద్రబాబు పేర్కొన్నారు.
2014లో వ్యవసాయం ఏపీలో 33 శాతం, తెలంగాణలో 19 శాతం ఉండేది. 2014లో పరిశ్రమలు ఏపీలో 23 శాతం ఉంటే, తెలంగాణలో 19 శాతం ఉన్నాయి. 2014లో సేవల రంగం ఏపీలో 44 శాతం ఉంటే, తెలంగాణలో 61 శాతానికి విస్తరించింది. ఒక్క హైదరాబాద్ వల్లనే సేవల రంగంలో రెండు రాష్ట్రాల మధ్య 17 శాతం తేడా నెలకొంది.
రాష్ట్రానికి పోలవరం జీవనాడి వంటిది. పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుంది. ఏపీకి సుదీర్ఘ తీరప్రాంతం ఉండడం కలిసొచ్చే అంశం. అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళుతుంది. రూ.1167 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశాం. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం చేకూరింది.
విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేశాం. కాకినాడ సెజ్ కు 8 వేల ఎకరాల భూమి సేకరిస్తే, గత ప్రభుత్వ హయాంలో అంతా మార్చేశారు. రాష్ట్రంలో 8 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ ఇచ్చాం. కానీ, 2019 తర్వాత తప్పుడు పాలనతో పరిస్థితి తారుమారైంది. అస్తవ్యస్త విద్యుత్ కొనుగోళ్ల విధానం ద్వారా రూ.12,250 కోట్ల మేర అదనపు భారం పడింది. అక్రమ ఇసుక తవ్వకాలతో రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లింది. రూ.9,750 కోట్ల మేర ఖనిజ సంపదను దోచుకున్నారు. 101.16 ఎకరాల మడ అడవులను ధ్వంసం చేస్తే, ఎన్జీటీ రూ.5 కోట్ల జరిమానా వేసింది.
పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోగా... అమరావతి, పోలవరం, శక్తి ఉత్పాదన రంగంలో కాంట్రాక్టులు రద్దయ్యాయి. ప్రభుత్వ అసమర్థత కారణంగా ఒక్క విద్యుత్ రంగంలోనే 1.29 లక్షల కోట్ల నష్టం వచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టు నిర్ధారణలో జాప్యం కారణంగా రూ.45 వేల కోట్లు, డ్యామేజీలు, మరమ్మతులతో మరో రూ.4,900 కోట్లు, జల విద్యుత్ ఉత్పాదనలో జాప్యం కారణంగా రూ.3 వేల కోట్లు నష్టం వాటిల్లింది.
గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు వ్యతిరేక విధానం అవలంబించారు. మేం కేటాయించిన 227 ఎకరాల భూములను ఉపసంహరించుకుని, పరిశ్రమలను తరిమేశారు. మా హయాంలో 5 లక్షల కోట్లతో పరిశ్రమలు పనులు ప్రారంభించాయి. 20 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఇచ్చాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమానికి బడ్జెట్ లో 34 శాతం ఖర్చు చేశాం. కానీ వీళ్లు అధికారంలోకి వచ్చాక పన్నులు విపరీతంగా పెంచేశారు. విద్యుత్ చార్జీలు పెరిగాయి, ఆర్టీసీ చార్జీలు పెంచారు, ఇసుక రేట్లు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, చివరికి చెత్త మీద కూడా పన్ను విధించారు.
ఇవాళ్టికి రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు. ఇంకా కొన్ని లెక్కలు రావాల్సి ఉంది. తవ్వేకొద్దీ శవాలు బయటపడుతున్నట్టు అప్పులు బయటికొస్తున్నాయి. తలసరి అప్పు రూ.74,790 నుంచి రూ.1,44,336 పెరిగింది. మరోవైపు ఆదాయం 13.2 శాతం నుంచి 9.5 శాతానికి పడిపోయింది. తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది.
మరి డీబీటీ అన్నారు కదా... ఎక్కడికి కొట్టుకుపోయింది? ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది? పేదవాడికి ఉపయోగపడాల్సిన కార్యక్రమాలు చేయలేదన్న విషయం ఈ గణాంకాల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది" అంటూ చంద్రబాబు వివరించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)