ap nominated posts cm chandrababu super farmula for sharing nominated posts with janasena-bjp

Vij, July 26: ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర త్వరలోనే భర్తికానుంది. తమ పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులకు దక్కించుకునేందు ఆశావాహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక నామినేటెడ్ పోస్టుల్లో తెలుగుదేశం నాయకులతో పాటు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఎవరూ నిరాశపడకుండా సూపర్ ఫార్ములాను సిద్ధం చేశారట చంద్రబాబు. ఇంతకీ చంద్రబాబు చేసిన ప్రతిపాదన ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచిందో అంత శాతం మేరకు అంటే అన్ని నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 164 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 60 శాతం నామినేటెడ్ పోస్టులు జనసేనకు 30 శాతం నామినేటెడ్ పోస్టులు, బీజేపీకి 10 శాతం పోస్టులు ఇచ్చేందుకు ప్రతిపాదన సిద్ధం చేశారట చంద్రబాబు.జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 60 శాతం జనసేన, 30 శాతం టీడీపీ, 10 శాతం బీజేపీ నేతలకు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి 50 శాతం మిగిలిన 50 శాతం పదవుల్ని తెలుగుదేశం, జనసేన చెరిసగం పంచుకోవాలనే ప్రతిపాదన రెడీ చేశారట చంద్రబాబు.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా సమావేశాలు ముగిసిన వెంటనే నామినేటెడ్ పదవుల జాతర ఉండనుంది. ఇందుకు సంబంధించి మూడు పార్టీల నేతలు ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రధాన పదవులను మాత్రం టీడీపీకే ఉండేలా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఫార్ములాను తెలుగు దేశం నాయకులతో పాటు జనసేన, బీజేపీ నేతలు సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా తన రాజకీయ అనుభవాన్ని అంతా ఉపయోగించి పాలన సాగిస్తున్నారు చంద్రబాబు. ఎక్కడా భేషజాలకు పోవడం లేదు. డిప్యూటీ సీఎంగా పవన్ ఎంపిక, ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో పవన్ ఫోటో ఉండేలా ఆదేశాలిచ్చారు కూడా. ఇలా ప్రతి అంశంలో మిత్రపక్షాలకు పెద్దపీట వేస్తూ చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీలో నవ్వులు పూయించిన చంద్రబాబు,80 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు, నిల్చోబెట్టి మరీ..వీడియో