YSR Sujaladhara Project: వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులని ప్రారంభించిన సీఎం జగన్, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు
వైఎస్ఆర్ సుజల ధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌ను వైఎస్ జగన్ ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు
CM Jagan Srikakulam Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. వైఎస్ఆర్ సుజల ధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌ను వైఎస్ జగన్ ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఏ ప్రభుత్వాలు చొరవచూపలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.785 కోట్లతో ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్ఆర్ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందించబోతున్నట్లు వెల్లడించారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా అందించబోతున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.
సిటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్ రే (డిజిటల్), థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషీన్ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టులు భర్తీ చేశారు.