Chhattisgarh Encounter: అమర జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 30 లక్షల ఆర్థిక సాయం, రెండు కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్, జవాన్ల వీరమరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో అమరులైన ఏపీకి చెందిన ఇద్దరు జవాన్ల (jawans) కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.

AP Chief Minister YS Jagan inaugurated the Amul project (Photo-Video Grab)

Amaravati, April 5: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడిలో మరణించిన జవాన్ల మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో అమరులైన ఏపీకి చెందిన ఇద్దరు జవాన్ల (jawans) కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.

విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో రూ.30 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని వెనువెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.ఈ కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌ ఎన్కౌంటర్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. అమర జవాన్ల కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఈ తెలుగువీరుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, తక్షణ ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తెలుగు నేల ఇద్దరు ముద్దుబిడ్డలను కోల్పోయిందని నారా లోకేష్ అన్నారు.

చ‌త్తీస్‌ఘ‌డ్‌ ఎన్‌కౌంట‌ర్‌ ఇంటెలిజెన్స్ సమాచార వైఫల్యం, ఇది 21వ శతాబ్దం, భారత జవాను శరీర రక్షణ కవచం లేకుండా శత్రువును ఎదుర్కోరాదు, బీజాపూర్ ఎన్‌కౌంట‌ర్‌పై రాహుల్ గాంధీ

వీర మరణం పొందిన రౌతు జగదీశ్‌కు విజయనగరం వాసులు ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ పతాకంతో విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించారు. గాజులరేగలో నివసించే రౌతు సింహాచలం, రమణమ్మ దంపతుల కుమారుడు జగదీశ్‌. ఆయనకు ఇటీవలే పెళ్లి కుదిరింది. వచ్చేనెల 22 తేదీన పెళ్లి వేడుకలను నిర్వహించాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. దీనికోసం జగదీష్ ఈ నెల 15వ తేదీన విజయనగరానికి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అంతలోపే ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారు.

ప్లాన్ ప్రకారమే మావోయిస్టుల దాడి, అమరులైన 22 మంది జవాన్లు, 21 మంది మిస్సింగ్, గాయాలతో 30 మంది, ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై హోంమంత్రి అమిత్‌ షా ఆరా, జవాన్ల మృతి పట్ల సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ

2010లో ఆయన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యారు. మావోయిస్టులను ఏరివేయడానికి ఏర్పాటు చేసిన కోబ్రా వింగ్‌లో చేరారు. ఇదే ఎన్‌కౌంటర్‌లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండర్‌ శాఖమూరి మురళీకృష్ణ అమరులయ్యారు.