AP CM Got Corona Test: ఏపీ సీఎం వైయస్ జగన్‌కు కరోనా టెస్ట్, నెగెటివ్‌గా నిర్ధారణ, దక్షిణ కొరియా నుండి రాష్ట్రానికి లక్ష పరీక్షా కిట్లు, 10 నిమిషాల్లోనే కరోనా ఫలితం
శుక్రవారం మధ్యాహ్నం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ (rapid test kit) ద్వారా డాక్టర్లు పరీక్ష నిర్వహించారు. పరీక్షలో కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. దక్షిణ కొరియా (South Korea) నుంచి రాష్ట్రానికి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ప్రత్యేక చార్టర్ విమానంలో ఇవాళ తీసుకొచ్చారు. ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితం తేలనుంది.
Amaravati, April 17: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్(కోవిడ్-19) పరీక్షలు (AP CM Got Corona Test) చేయించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ (rapid test kit) ద్వారా డాక్టర్లు పరీక్ష నిర్వహించారు. పరీక్షలో కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. దక్షిణ కొరియా (South Korea) నుంచి రాష్ట్రానికి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ప్రత్యేక చార్టర్ విమానంలో ఇవాళ తీసుకొచ్చారు. ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితం తేలనుంది. క్వారంటైన్‌కు గుంటూరు డాక్టర్లు, మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీలకు కరోనావైరస్ పాజిటివ్
కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ర్యాపిడ్ కిట్లను వినియోగించనున్నారు. ఇన్ఫెక్షన్ ఉందా..లేదా? అని నిర్ధారించడమే కాకుండా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గినా కూడా ర్యాపిడ్ కిట్లు గుర్తించనున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా
Here's ANI Tweet
ఇదిలా ఉంటే కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రతి పదిలక్షల జానాభాకుగాను ఏపీ ప్రభుత్వం 331కి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16555 పరీక్షలు చేపట్టింది. ఈ జాబితాలో రాజస్తాన్ (549), కేరళ (485), మహారాష్ట్ర (446) తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో మిలియన్ జనాభాకు సగటున 198 పరీక్షలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో 331 మందికి చేస్తున్నారు. గుజరాత్, తమిళనాడుల కంటే ఏపీ ముందు స్థానంలో నిలవడం గమనార్హం.
ఏపీ సర్కారు కీలక నిర్ణయం, క్వారంటైన్ పూర్తి చేసుకున్న బాధితులకు రూ.2 వేలు
వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో రోజుకు 90 టెస్టుల స్థాయి నుంచి 3వేలకు పైగా టెస్టులు చేసే స్థాయికి సామర్థ్యాన్ని పెంచుకున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా కరోనా కట్టడికి ప్రభుత్వం తొలినుంచి కఠిన చర్యలు అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 572కి చేరింది.