CM YS Jagan Review: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు & భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష, లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూ సర్వే జరగాలని ఆదేశాలు
లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూ సర్వే జరగాలని, ఈ విషయంలో దేశానికే రాష్ట్రం దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) ఆకాంక్షించారు. సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలను సీఎం జగన్‌కు అధికారులు అందించారు.
Amaravati, Mar 31: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు & భూ రక్ష పథకంపై గురువారం క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష (CM YS Jagan Review) నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూ సర్వే జరగాలని, ఈ విషయంలో దేశానికే రాష్ట్రం దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) ఆకాంక్షించారు. సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలను సీఎం జగన్‌కు అధికారులు అందించారు.
అంతేకాదు సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్‌లను సీఎం జగన్ పరిశీలించారు. ఏప్రిల్ 5వ తేదీకల్లా భూ సర్వేకోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమవుతాయని, వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అవినీతి.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఇది జరగాలని సీఎం వైఎస్ జగన్.. అధికారులకు సూచించారు. అనుసరించాల్సిన విధానాలు, ఎస్‌ఓపీలను తయారు చేయాలని, రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, ట్యాంపర్ చేయలేని విధంగా రూపొందించాలని ఆదేశించారు.
కేవలం ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్ రికార్డులు కూడా తయారుచేయాలని, ఆ ఫిజికల్ డాక్యుమెంట్ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అధికారులతో చెప్పారు. సబ్ డివిజన్‌కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలన్న సీఎం జగన్.. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలని స్పష్టం చేశారు.
మొత్తంగా ఈ పథకం (Jagananna Saswatha Bhu Hakku and Bhu Raksha Pathakam) భూ సర్వే కోసం 154 డ్రోన్లను వినియోగిస్తామన్న అధికారులు.. ఇప్పటివరకూ 1,441 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసినట్లు సీఎం జగన్‌కు వివరించారు. వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర డ్రోన్ సర్వే నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నామన్న అధికారులు.. రెవెన్యూ విలేజ్ చొప్పున సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. 5,200 గ్రామాల్లో 2023 జులై నెలాఖరుకు, 5,700 గ్రామాల్లో 2023 ఆగస్టు నెలాఖరు కల్లా, సెప్టెంబరు నెలాఖరు నాటికి 6,460 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి క్లియర్ టైటిల్స్ ఇచ్చేలా కార్యాచరణ పూర్తి చేశామని అధికారులు తెలిపారు.